News November 3, 2024
ఒకే దేశం-ఒకే ఎన్నికకు మేం వ్యతిరేకం: దళపతి విజయ్ పార్టీ తీర్మానం

జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం తీర్మానం చేసింది. ఇటీవలే మొదటి రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించిన ఆ పార్టీ జాతీయ స్థాయిలో ముడిపడిన అంశాల పట్ల తన వైఖరిని వెల్లడించింది. అలాగే NEETను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పార్టీ కార్యనిర్వాహక మండలి తీర్మానం చేసింది. ఇక కులగణన నిర్వహించకపోవడంపై డీఎంకే, బీజేపీల తీరును తప్పుబట్టింది.
Similar News
News October 29, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 29, బుధవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.00 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.10 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.46 గంటలకు
✒ ఇష: రాత్రి 6.59 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 29, 2025
తీరం దాటిన తర్వాత కూడా మొంథా తుఫాన్ ప్రభావం: CM

AP: తీరం దాటిన తర్వాత కూడా మొంథా తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని CM CBN అన్నారు. ఈదురు గాలులతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన చోట వెంటనే పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాధితులకు తక్షణ సాయం అందేలా చూడాలని, స్థానిక పరిస్థితులను ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు.
News October 29, 2025
రోహిత్‌కు తగిన గుర్తింపు దక్కలేదు: క్లార్క్

ఇండియాకు రివర్స్‌గా ఉండే ఆస్ట్రేలియన్ కండిషన్లలోనూ రోహిత్ శర్మ బాగా ఆడుతారని AUS మాజీ ప్లేయర్ మైఖేల్ క్లార్క్ ప్రశంసించారు. హిట్ మ్యాన్ ఆడే విధానం తనకు నచ్చుతుందని తెలిపారు. ‘వైట్ బాల్ కెప్టెన్‌గా రోహిత్‌కు తగిన గుర్తింపు దక్కలేదు. నేను కలిసి ఆడిన బెస్ట్ వైట్ బాల్ ప్లేయర్లలో అతను ఒకడు. కోహ్లీ అద్భుతమైన వన్డే క్రికెటర్. ప్రస్తుత ఫామ్ కొనసాగితే 2027 WCలోనూ వీరు ఆడే అవకాశం ఉంది’ అని పేర్కొన్నారు.


