News January 16, 2025
‘సంక్రాంతికి వస్తున్నాం’: రెండ్రోజుల్లో రూ.77 కోట్లు
విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కలెక్షన్లలో దూసుకెళ్తోంది. రెండు రోజుల్లోనే రూ.77 కోట్లు(గ్రాస్) వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈరోజు కూడా బుక్ మై షోలో వేలల్లో టికెట్స్ బుక్ అవడంతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొన్నాయి. మూవీలో వెంకీ కుటుంబం చేసిన కామెడీ ఫ్యామిలీ ఆడియన్స్‌ను తెగ మెప్పిస్తోంది.
Similar News
News January 16, 2025
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై అమ్మాయిపై అత్యాచారం
TG: సోషల్ మీడియా మోజులో పలువురు అమ్మాయిలు మోసపోతున్నారు. తాజాగా ADBలోని ఓ మెడికల్ కాలేజీ విద్యార్థిని (17)కి ఇన్‌స్టాగ్రామ్‌లో రంగారెడ్డి జిల్లాకు చెందిన శివ (22) పరిచయం అయ్యాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి నమ్మించడంతో ఆమె ఈ నెల 9న సికింద్రాబాద్ వచ్చింది. బాలికను ప్రలోభపెట్టి అత్యాచారం చేశాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ఆమె ఆచూకీ తెలుసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు.
News January 16, 2025
యాక్సిడెంట్‌కు గురైన వ్యక్తి బైక్‌తో పరార్.. చివరికి ఏమైందంటే?
మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలని చెప్పే కర్మ సిద్ధాంతానికి ఈ ఘటన నిదర్శనం. ఢిల్లీలో ప్రమాదానికి గురైన ఓ వ్యక్తికి సాయం చేయకుండా, అతని బైక్‌ను ఎత్తుకెళ్లిన ముగ్గురికి యాక్సిడెంట్ అయింది. వికాస్ అనే వ్యక్తి బైక్ నుంచి పడిపోగా ఇది చూసిన ఉదయ్, టింకు, పరంబీర్‌లు అతడి బైక్‌తో పరారయ్యారు. కొద్దిసేపటికే వీరికి యాక్సిడెంట్ కాగా తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరారు. కాగా, వికాస్ చనిపోయాడు.
News January 16, 2025
టీమ్ఇండియాకు బ్యాటింగ్ కోచ్‌గా ఉంటా: కెవిన్
టీమ్ఇండియాకు బ్యాటింగ్ కోచ్‌గా ఉండేందుకు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఇంట్రెస్ట్ చూపారు. పురుషుల జట్టు కోసం బ్యాటింగ్ కోచ్ అన్వేషణలో బీసీసీఐ ఉందని ఓ జర్నలిస్టు చేసిన ట్వీట్‌కు కెవిన్ రిప్లై ఇచ్చారు. నేను అందుబాటులో ఉన్నా అంటూ ఆయన సమాధానమిచ్చారు. కెవిన్ తన కెరీర్‌లో 104 టెస్టుల్లో 8181 రన్స్, 136 వన్డేల్లో 4440, 37 టీ20ల్లో 1176 రన్స్ చేశారు.