News February 22, 2025
గ్రూప్-2 పరీక్షల వాయిదాకు కట్టుబడి ఉన్నాం: CM చంద్రబాబు

AP: గ్రూప్-2 పరీక్షల వాయిదాకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘రోస్టర్ విధానంపై 3 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. అభ్యర్థుల ఆందోళన తమ దృష్టికి రాగానే సాధ్యాసాధ్యాలు పరిశీలించాం. కోర్టులో మార్చి 11న విచారణ దృష్ట్యా అప్పటి వరకు వాయిదా వేయాలని APPSCకి రాసిన లేఖలో కోరాం. రోస్టర్ సమస్య సరిదిద్దాకే పరీక్ష నిర్వహించాలన్నదే ప్రభుత్వ అభిమతం’ అని చంద్రబాబు అన్నారు.
Similar News
News November 27, 2025
APPLY NOW: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2700 పోస్టులు

బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB)లో డిగ్రీ అర్హతతో 2,700 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం అప్రెంటిస్‌లలో TGలో 154, APలో 38 ఉన్నాయి. వయసు 20-28ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. NATS/ NAPS పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ ఎగ్జామ్, DV, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.15,000 చెల్లిస్తారు.
News November 27, 2025
ఇమ్రాన్‌ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారు: పాక్ రక్షణ మంత్రి

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ జైలులో ఆరోగ్యంగా ఉన్నారని రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వెల్లడించారు. జైలులో 5స్టార్ హోటల్ కంటే మెరుగైన ఫుడ్ అందుతోందని, టీవీ చూసేందుకు, వ్యాయామానికి అనుమతిచ్చినట్టు చెప్పారు. నేడు, డిసెంబర్ 2న ఆయనను కలిసేందుకు కుటుంబసభ్యులకు జైలు అధికారులు అనుమతిచ్చారు. ఇమ్రాన్‌ను మరో జైలుకు తరలించారనే వార్తలను తోసిపుచ్చారు. రావల్పిండి జైలు దగ్గర ఇమ్రాన్ మద్దతుదారులు ఆందోళన విరమించారు.
News November 27, 2025
మిరపలో బూడిద తెగులు – నివారణ

మిరపను నవంబర్ నుంచి జనవరి వరకు బూడిద తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. తెల్లని పొడి పూత ఎక్కువగా ఆకుల దిగువ భాగంలో కనిపిస్తుంది. ఆకుల పై భాగంలో పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. ఆకులు ఎండి రాలిపోతాయి. తెగులు సోకిన ఆకుభాగం గోధుమ రంగులోకి మారుతుంది. ఈ తెగులు నివారణకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో అజోక్సిస్ట్రోబిన్ 23% SC 200ml లేదా టెబుకొనజోల్25% WG 300 గ్రా. లేదా సల్ఫర్ 80% WP 800 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.


