News September 1, 2024

ఆడపిల్లల రక్షణకు కట్టుబడి ఉన్నాం: సీఎం చంద్రబాబు

image

AP: గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఘటనపై విచారణ కొనసాగుతోందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఢిల్లీ సాంకేతిక నిపుణుల సాయం తీసుకుంటున్నామన్నారు. ‘ఆడపిల్లల రక్షణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అనుమానం ఉన్నవారి ఫోన్లు, కంప్యూటర్లు తనిఖీ చేస్తాం. ఈ ఘటనపై ఆధారాలుంటే పోలీసులకు ఇవ్వాలి’ అని సూచించారు. రాష్ట్రమంతా ఏదో జరిగిపోతోందని విపక్షం దుష్ప్రచారం చేయడం దారుణమని మండిపడ్డారు.

Similar News

News November 18, 2025

ఉద్యోగుల పనితీరుపై కాగ్నిజెంట్ సాఫ్ట్‌వేర్ కన్ను

image

IT సంస్థలు హైబ్రిడ్ విధానంలో ఉద్యోగులతో పనిచేయిస్తున్నాయి. అయితే వారి పనితీరు తెలుసుకొనేలా ‘Cognizant’ ‘ప్రో-హాన్స్ స్టైల్’ సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టింది. ఇది మౌస్‌ను ట్రాక్ చేస్తుంటుంది. 300 సెకండ్లు కదలకపోతే ఐడల్‌గా, 15 ని.లు మించితే దూరంగా ఉన్నట్లు తెలుపుతుంది. వాడే అప్లికేషన్లనూ గుర్తిస్తుంది. కాగా ఇది సిబ్బంది పనితీరును అంచనా వేయడానికి కాదని, వినియోగం తెలుసుకొనేందుకేనని కంపెనీ చెబుతోంది.

CNG సరఫరా నిలిచి ముంబైలో స్తంభించిన రవాణా

image

ముంబైలో 2 రోజులుగా CNG సరఫరా నిలిచి ప్రైవేట్, పబ్లిక్ రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది. పైప్ లైన్లో సమస్యతో నగరంలోని 486 రీఫిల్లింగ్ స్టేషన్లలో ఆదివారం నుంచి గ్యాస్ సరఫరా నిలిచింది. CNGతో నడిచే ఆటోలు, కార్లు, బస్సులు తిరగక అవస్థలు తప్పలేదు. సోమవారం నాటికి కొంతమేర సరఫరా చేపట్టారు. నేటి మధ్యాహ్నానికి కానీ పూర్తి సరఫరా కాదని కంపెనీలు పేర్కొన్నాయి. కాగా ముంబైలో CNGతో నడిచే కార్లే 5 లక్షల వరకు ఉన్నాయి.