News December 20, 2024

మెట్రో ట్రైన్‌లకు 6 కోచ్‌ల ఏర్పాటును పరిశీలిస్తున్నాం: మంత్రి

image

హైదరాబాద్ మెట్రో ట్రైన్ల కోచ్‌లను 6కు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు శాసన మండలిలో వెల్లడించారు. మెట్రోను 3 కోచ్‌లతో నడపడానికి తయారు చేశామని, దానిని 6 కోచ్‌లుగా మార్పు చేయవచ్చని తెలిపారు. కానీ 8 కోచ్‌లు నడపడానికి ఈ మెట్రో డిజైన్ అనుమతించదని పేర్కొన్నారు. ఇతర మెట్రోల్లాగా కాకుండా HYD మెట్రో ప్రాజెక్టు పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం) పద్ధతిలో నిర్మించినదని గుర్తుచేశారు.

Similar News

News December 20, 2024

ఉపేంద్ర ‘UI’ పబ్లిక్ టాక్

image

విభిన్న సినిమాలు తీసే ఉపేంద్ర ‘UI’లో వన్ మ్యాన్ షో చేశారని ప్రేక్షకులు అంటున్నారు. మూవీలో కల్కి భగవాన్ వర్సెస్ హీరోకు మధ్య సాగే సన్నివేశాలు హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయని చెబుతున్నారు. ఇంటర్వెల్‌ బ్లాక్ బాగుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇంకొందరు అయితే మూవీ అస్సలు అర్థం కావట్లేదని చెబుతున్నారు. ప్రయోగాలు ఇష్టపడే వారికే మూవీ నచ్చుతుందట. మరికొద్ది‌సేపట్లో WAY2NEWS రివ్యూ.

News December 20, 2024

BREAKING: అసెంబ్లీలో గందరగోళం

image

తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభాపతి గడ్డం ప్రసాద్‌పైకి పేపర్లు విసిరారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఇదే సమయంలో తమపై కాంగ్రెస్ సభ్యులు పేపర్లు విసిరారంటూ, షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకరయ్య చెప్పు చూపించారని బీఆర్ఎస్ MLAలు స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. ఇరువర్గాల తీరుతో సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను 15 నిమిషాలు వాయిదా వేశారు.

News December 20, 2024

చివరి 2 టెస్టులకు ఆస్ట్రేలియా స్క్వాడ్ ప్రకటన

image

BGTలో భాగంగా చివరి 2 టెస్టులకు ఆసీస్ క్రికెట్ బోర్డు స్క్వాడ్‌ను ప్రకటించింది. పాట్ కమిన్స్(కెప్టెన్), స్టీవ్ స్మిత్, సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్ట్సాస్, మార్నస్ లబుషేన్, నాథన్ లయన్, మిచెల్ మార్ష్, రిచర్డ్ సన్, మిచెల్ స్టార్క్, వెబ్‌స్టర్. మూడో టెస్ట్ డ్రా కాగా, నాలుగో టెస్టు మెల్‌బోర్న్, ఐదో టెస్టు సిడ్నీలో జరగనుంది.