News December 30, 2024

మేం చాలా గొప్పగా పనిచేస్తున్నాం: పవన్

image

AP: గత ప్రభుత్వం కన్నా తమ ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తుందని డిప్యూటీ CM పవన్ అన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న అడ్డగోలు నిర్ణయాలపై అధికారులు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారని మండిపడ్డారు. YCP అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని, పనిచేసే సంస్కృతిని చంపేసిందని విమర్శించారు. గత ప్రభుత్వం తొలి 6 నెలలు, ఈ ప్రభుత్వం 6 నెలల పాలనను బేరీజు వేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంటుందన్నారు.

Similar News

News October 30, 2025

అజహరుద్దీన్‌‌కు మంత్రి పదవి.. మీరేమంటారు?

image

TG: అజహరుద్దీన్‌ మంత్రి కావడానికి టైం ఫిక్స్ అయింది. కాగా మంత్రివర్గ విస్తరణ సమయాల్లో గతంలో లేనంతగా కాంగ్రెస్ తాజా నిర్ణయం కాక రేపుతోంది. దేశ ద్రోహికి మంత్రి పదవి ఎలా ఇస్తారని BJP.. ఓ సామాజికవర్గం ఓట్ల కోసం కాంగ్రెస్ దిగజారిందని BRS ధ్వజమెత్తాయి. అయితే అజహరుద్దీన్ క్రికెట్‌లో దేశానికి పేరు తెచ్చారని, ఆయనకు పదవి రాకుండా ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని కాంగ్రెస్ చెబుతోంది. దీనిపై మీరేమంటారు.

News October 30, 2025

CBSE పరీక్షల తేదీలు విడుదల

image

వచ్చే ఏడాది జరిగే టెన్త్, 12వ తరగతి పరీక్షల ఫైనల్ డేట్ షీట్‌ను CBSE విడుదల చేసింది. రెండు క్లాసులకూ ఫిబ్రవరి 17 నుంచి పరీక్షలు మొదలవుతాయి. టెన్త్ విద్యార్థులకు మార్చి 10వ తేదీ వరకు, 12వ క్లాస్ స్టూడెంట్లకు ఏప్రిల్ 9 వరకు జరుగుతాయి. రోజూ ఉదయం 10.30 గంటలకు ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి. పరీక్షల షెడ్యూల్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News October 30, 2025

ఆ విద్యార్థుల అకౌంట్లలో నగదు జమ: అడ్లూరి

image

TG: ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌ స్కీం కింద ఒక్కో విద్యార్థికి ₹20 లక్షల చొప్పున 2,288 మందికి ₹304 కోట్లు <<18143119>>విడుదల<<>> చేసినట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. 2022 నుంచి ఇప్పటివరకు ₹463 కోట్లు రిలీజ్ చేసినట్లు చెప్పారు. దీంతో విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రాష్ట్ర విద్యార్థులకు ఉపశమనం లభిస్తుందన్నారు. అర్హత కలిగిన విద్యార్థుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా నగదు జమ అవుతుందని తెలిపారు.