News April 2, 2024

జిత్తులమారి పొత్తుల ముఠాతో యుద్ధం చేస్తున్నాం: సీఎం జగన్

image

AP: మోసాలే అలవాటుగా, అబద్ధాలే పునాదులుగా చేసుకున్న జిత్తులమారి పొత్తుల ముఠాతో యుద్ధం చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. ఆ ముఠా నాయకుడు చంద్రబాబు అని విమర్శించారు. ‘అరుంధతి సినిమాలో సమాధి నుంచి లేచిన పశుపతి లాగా.. ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు అనే పసుపు పతి వస్తున్నారు. వదల బొమ్మాళీ వదల.. అంటూ పేదల రక్తం పీల్చేందుకు కేకలు పెడుతున్నారు’ అని ఫైరయ్యారు.

Similar News

News February 6, 2026

‘బంగారు లేడి’ని కోరుకోకండి!

image

రామాయణంలో బంగారు లేడి కథ తెలిసిందే! సీతమ్మ ఆ మాయా లేడిని కోరడం వల్ల ఎన్నో కష్టాలొచ్చాయి. దీన్ని నేటి కాలం పాఠంగా భావించవచ్చు. మన జీవితంలోనూ కొన్ని వస్తువులు, సంబంధాలు బంగారు లేడిలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కానీ, అవి తాత్కాలిక భ్రమలే కావచ్చు. విచక్షణ లేని కోరికలు లక్ష్యాన్ని దూరం చేస్తాయి. అందుకే ఆకర్షణలకు దూరముండాలి. కోరిక వెనుకున్న వాస్తవాన్ని గ్రహించాలి. అప్పుడే శాంతిని, సుఖాన్ని పొందగలం.

News February 6, 2026

అస్సోం రైఫిల్స్‌లో 95 పోస్టులు.. అప్లై చేశారా?

image

అస్సోం రైఫిల్స్( స్పోర్ట్స్ కోటా)లో 95 పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా 3 రోజులే సమయం(FEB 9) ఉంది. టెన్త్ పాసై, అంతర్జాతీయ, జాతీయ, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్, నేషనల్ స్పోర్ట్స్ , ఖేలో ఇండియాలో పతకాలు సాధించినవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఫీల్డ్ ట్రయల్, PST, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సైట్: assamrifles.gov.in/

News February 6, 2026

నారు నాటేటప్పుడు వైరస్ తెగుళ్ల నుంచి రక్షణ కోసం

image

నారు మొక్కలను పొలంలో నాటే 2-3 రోజుల ముందు ఇమిడాక్లోప్రిడ్ (లీటరు నీటికి 0.4 మి.లీ.) లేదా అసిటామిప్రిడ్ (లీటరు నీటికి 0.3 గ్రా.) మందు ద్రావణం నారు మొక్కలపై పిచికారీ చేయాలి. దీని వల్ల వైరస్‌ను వ్యాప్తిచేసే రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. అలాగే పొలంలో కూడా వైరస్‌ను వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగుల ఉద్ధృతిని తగ్గించేందుకు జిగురు పూసిన నీలం, పసుపురంగు అట్టలను ఎకరాకు 25 ఉంచితే మంచి ఫలితాలు వస్తాయి.