News August 19, 2024
మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నాం: మంత్రి సీతక్క

TG: తమ ప్రభుత్వం మహిళల భద్రతకు పెద్దపీట వేస్తోందని మంత్రి సీతక్క అన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరిగిన వెంటనే తాము వాయువేగంతో స్పందిస్తున్నామని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం కేటీఆర్ అవాస్తవాలు చెబుతున్నారని ఆమె విమర్శించారు. BRS హయాంలో మహిళలపై దాడులు జరిగితే బయటికి రాకుండా తొక్కిపెట్టారని మంత్రి ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఇలా స్పందించారు.
Similar News
News December 3, 2025
ప్రకటనే పవన్ సమాధానమా?

తెలంగాణకు పవన్ <<18446578>>క్షమాపణలు<<>> చెప్పాలన్న డిమాండ్ల నేపథ్యంలో జనసేన నుంచి వెలువడిన <<18451648>>ప్రకటన<<>> చర్చనీయాంశమైంది. ఇదే ఆయన సమాధానమా? ప్రత్యేకంగా మాట్లాడరా? ప్రకటనతో వివాదం ముగుస్తుందా? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అటు Dy.CM హోదాలో ఉన్న వ్యక్తి బాధ్యతగా మాట్లాడాలని రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వివాదానికి ఆయన త్వరగా ముగింపు పలకాలని సూచిస్తున్నారు.
News December 3, 2025
VHTలో ఆడనున్న విరాట్ కోహ్లీ!

దేశవాళీ ODI టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ (VHT)లో ఆడేందుకు విరాట్ కోహ్లీ అంగీకరించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఈ విషయాన్ని ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రోహన్ జైట్లీ ధ్రువీకరించారని తెలిపింది. DEC 24 నుంచి జరగనున్న ఈ టోర్నీలో కోహ్లీ 3 మ్యాచుల్లో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించే ఛాన్సుంది. దాదాపు 15ఏళ్ల తర్వాత ఆయన ఈ టోర్నీలో ఆడనున్నారు. అటు రోహిత్ శర్మ ముంబై తరఫున ఆడే అవకాశముంది.
News December 3, 2025
గ్లోబల్ సమ్మిట్: ఖర్గేకు సీఎం రేవంత్ ఆహ్వానం

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానాలు అందజేస్తున్నారు. సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన ఆయన కాసేపటి క్రితమే AICC చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిశారు. సమ్మిట్ ఇన్విటేషన్ను అందజేశారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఎంపీలున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపైనా వారు ఖర్గేతో చర్చించారు.


