News December 21, 2024

పాతబస్తీలో చ.గజానికి రూ.81వేలు ఇస్తున్నాం: ఎన్వీఎస్ రెడ్డి

image

TG: పాతబస్తీలో మెట్రో పనులు శరవేగంగా జరుగుతున్నాయని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. విస్తరణపై ప్రభుత్వం బృహత్తర ప్రణాళికలు రచిస్తోందని, త్వరలోనే సీఎం పూర్తి వివరాలు వెల్లడిస్తారని చెప్పారు. పాతబస్తీలో మెట్రో మార్గం కోసం 1100 ఆస్తులను సేకరిస్తున్నామని, చదరపు గజానికి రూ.81వేలు చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే నిర్వాసితులకు చెక్కులు ఇచ్చి, నిర్మాణాలను తొలగిస్తామని వెల్లడించారు.

Similar News

News November 26, 2025

26/11: మానవత్వం చాటుకున్న రతన్ టాటా!

image

ముంబై 26/11 ఉగ్రదాడుల సమయంలో టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ దివంగత రతన్ టాటా ఆర్మీ అధికారులకు అందించిన సపోర్ట్‌ను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. ఆయన 3 రోజులు తాజ్ హోటల్ వెలుపలే నిలబడి సహాయక చర్యల్లో భాగమై మానవత్వాన్ని చాటారు. ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు ఆస్తినష్టం జరిగినా పర్లేదని ఆర్మీని ఆయన కోరినట్లు తెలుస్తోంది. ఉద్యోగులు, బాధితుల కుటుంబాలకు ఆయన చికిత్స అందించి ఆర్థికంగా కూడా మద్దతుగా నిలిచారు.

News November 26, 2025

దేశంలో అతిపెద్ద నగరంగా హైదరాబాద్!

image

హైదరాబాద్ మహానగరాన్ని మరింత విస్తృతపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. GHMCలో 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను విలీనం చేయాలని నిర్ణయించింది. ORR వరకు, అవతలి వైపు ఆనుకుని ఉన్న కొన్ని ప్రాంతాలనూ గ్రేటర్‌గా పరిగణించనుంది. 1,2 నెలల్లో డివిజన్లు, కార్పొరేషన్ల విభజన పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. దీంతో 2,735 చదరపు కి.మీతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అవతరించనుంది.

News November 26, 2025

18 ఏళ్ల యువతను గౌరవిద్దాం: మోదీ

image

ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత పౌరులపై ఉందని PM మోదీ చెప్పారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ‘18ఏళ్లు నిండి, తొలిసారి ఓటు వినియోగించుకునే యువతను ఏటా NOV 26న విద్యాసంస్థల్లో గౌరవించాలి. విధులు పాటిస్తేనే హక్కులు వస్తాయన్న గాంధీ స్ఫూర్తితో అభివృద్ధి చెందిన వికసిత్ భారత్ వైపు అడుగులు వేయాలి’ అని పేర్కొన్నారు.