News January 21, 2025
డిఫరెంట్ రోహిత్‌ను చూడబోతున్నాం: గంగూలీ

ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మాజీ కెప్టెన్ గంగూలీ అండగా నిలిచారు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 మొదలు కాగానే డిఫరెంట్ రోహిత్‌ను చూడబోతున్నామని చెప్పారు. హిట్‌మ్యాన్ వైట్‌బాట్ క్రికెట్ అద్భుతంగా ఆడతారని ప్రశంసించారు. CT-2025 ఫిబ్రవరి 19న మొదలు కానుండగా భారత్ తన తొలి మ్యాచ్ 20న బంగ్లాదేశ్‌తో, 23న పాక్ జట్టుతో ఆడనుంది.
Similar News
News January 5, 2026
IT షేర్ల పతనం.. కారణమిదే!

IT కంపెనీల ఫలితాల సీజన్ మొదలవనున్న తరుణంలో ఆ రంగంలోని సంస్థల షేర్లు కుప్పకూలాయి. నేడు Nifty IT ఇండెక్స్ ఏకంగా 2.5% పడిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం థర్డ్ క్వార్టర్లో IT కంపెనీల గ్రోత్ చాలా తక్కువగా ఉంటుందన్న అంచనాలే దీనికి కారణం. అమెరికా, యూరప్ దేశాల్లో సెలవుల వల్ల బిజినెస్ తగ్గడం, కొత్త డీల్స్ రాకపోవడం IT సెక్టార్‌పై ఒత్తిడి పెంచుతోంది.
News January 5, 2026
నందీశ్వరుడు శివుడి వైపే ఎందుకు చూస్తాడు?

శివాలయాల్లో నంది శివుడి వైపే చూస్తుంటాడు. ఇది ఏకాగ్రత, భక్తికి సంకేతం. ఆయన శివుడికి అత్యంత సన్నిహితుడైన ద్వారపాలకుడు. మనసులోని ఆలోచనలు అటు ఇటు తిరగకుండా ఎప్పుడూ దైవచింతనలోనే ఉండాలని నంది స్థితి మనకు బోధిస్తుంది. భక్తుల కోరికలను విన్నవిస్తూ, వారిని శివదర్శనానికి సిద్ధం చేసేందుకు ఆయన శివుడి వైపే చూస్తూ ఉంటారు. ఆయన చెవిలో కోరికలు చెబితే వాటిని ఆయన నేరుగా శివుడికి చేరవేస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
News January 5, 2026
ఉడిపి కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<


