News October 18, 2024

ఇసుకపై సీనరేజ్ ఛార్జ్ వసూళ్లు ఎత్తివేస్తున్నాం: చంద్రబాబు

image

AP: ఉచిత ఇసుకపై సీఎం చంద్రబాబు మరో కీలక ప్రకటన చేశారు. సీనరేజ్ ఛార్జ్ వసూళ్లు కూడా ఎత్తివేస్తున్నట్లు చెప్పారు. లారీల్లో 40 టన్నులకు మించి ఉన్నా అధిక లోడ్ జరిమానాలు ఉండవని స్పష్టం చేశారు. టీడీపీ ప్రజాప్రతినిధుల భేటీలో సీఎం ఈమేరకు ప్రకటించారు. కాగా ఇప్పటికే రీచ్‌ల నుంచి ట్రాక్టర్లలో ఉచితంగా ఇసుక తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఇవాళ సాయంత్రం <<14392031>>అనుమతి<<>> ఇచ్చింది.

Similar News

News October 18, 2024

విద్యా కమిషన్ సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ

image

TG: రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీఎల్ విశ్వేశ్వర్ రావు, వెంకటేశ్, జ్యోత్స్నను నియమించింది. అంతకుముందు కమిషన్ ఛైర్మన్‌గా ఆకునూరి మురళిని నియమించిన సంగతి తెలిసిందే.

News October 18, 2024

డిప్యూటీ కలెక్టర్ పీవీ సింధు ఓడీ సదుపాయం మరో ఏడాది పొడిగింపు

image

AP: స్టార్ షట్లర్ పీవీ సింధు ఆన్‌డ్యూటీ సదుపాయాన్ని ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న సింధు హైదరాబాద్‌లో ఏపీ అధీనంలోని లేక్‌వ్యూ అతిథిగృహం ఓఎస్డీగా కొనసాగుతున్నారు. అయితే అంతర్జాతీయ పోటీల్లో శిక్షణ కోసం ఆమెకు 2025 సెప్టెంబర్ 30 వరకు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరుసగా ఆరోసారి దీన్ని పొడిగించినట్లు వెల్లడించింది.

News October 18, 2024

బోణి కొట్టిన తెలుగు టైటాన్స్

image

ప్రోకబడ్డీ లీగ్ 11వ సీజన్ తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ బోణీ కొట్టింది. బెంగళూరు బుల్స్‌తో జరిగిన మ్యాచులో 37-29 పాయింట్ల తేడాతో గెలుపొందింది. తెలుగు టైటాన్స్ కెప్టెన్ పవన్ షెరావత్ 13 పాయింట్లు రాబట్టడం గమనార్హం. ప్రో కబడ్డీ లీగ్‌లో పవన్ రికార్డు స్థాయిలో 1,200 పాయింట్లు సాధించారు. మరోవైపు రేపు రాత్రి 8 గంటలకు తమిళ్ తలైవాస్‌తో టైటాన్స్ రెండో మ్యాచ్ ఆడనుంది.