News September 12, 2025

అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా చూస్తున్నా: CM

image

AP: లాంగ్ టర్మ్ విజన్ వల్ల రాజకీయంగా నష్టం ఉంటుంది కదా అనే ప్రశ్నకు సీఎం చంద్రబాబు సమాధానమిచ్చారు. ‘అభివృద్ధి, రాజకీయ ప్రయోజనాలు.. ఇలా రెండింటి కోసం కష్టపడాల్సిన అవసరముంది. అందుకే సూపర్-6 అమలు చేశాం. అభివృద్ధి కోసం మూలధన పెట్టుబడులు పెంచాం. వృద్ధి రేటును 17%కి పెంచేలా కృషి చేస్తున్నా. నేను రాజకీయ ప్రయోజనాల గురించి ఆలోచిస్తే హైదరాబాద్ అభివృద్ధి చెందేది కాదు’ అని Way2News Conclaveలో తెలిపారు.

Similar News

News March 19, 2026

VJA: బ్లడ్ క్యాన్సర్‌తో ASI గోపి మృతి?

image

పటమట PSలో ASIగా పనిచేస్తున్న గోపి మృతిపై కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, చికిత్స పొందుతున్న క్రమంలోనే మృతి చెందారని ఆయన కుమారుడు శరత్ చంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనారోగ్యం కారణంగా తరచూ కళ్లు తిరిగి పడిపోయేవారని, ఈ క్రమంలోనే పెద్దపులిపాక కట్ట వద్ద ప్రాణాలు కోల్పోయారన్నారు. కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 19, 2026

పరాభవ నామ సంవత్సరం అర్థం ఇదే..

image

సాధారణ అర్థంలో పరాభవ అంటే అవమానం, ఓటమి. దీని ప్రకారం ఈ సంవత్సరమంతా అపజయాలు ఉంటాయని కాదు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను జయించి ధర్మబద్ధంగా కష్టపడేవారికి విజయాలను అందిస్తుందని పండితులు చెబుతున్నారు. ‘పరా-అమ్మవారు, భవ-ఉండు/ఆవిర్భావం/శివుడు అనే అర్థం. అంటే అమ్మవారికి సమీపాన ఉండటం లేదా పరాశక్తి ఆవిర్భావం లేదా అర్ధనారీశ్వర తత్వం అని కూడా అంటారు’ అని పేర్కొంటున్నారు.

News March 19, 2026

BREAKING: జాబ్ క్యాలెండర్ విడుదల

image

AP: 10,060 పోస్టులతో మంత్రి లోకేశ్ <<19422647>>జాబ్ క్యాలెండర్<<>> విడుదల చేశారు. ఉగాది కానుకగా ఉద్యోగాల పండగ ప్రకటిస్తున్నామని తెలిపారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు. ఉద్యోగార్థులందరూ ‘<>నైపుణ్యం<<>>’ పోర్టల్‌లో ‘వన్ టైమ్ రిజిస్ట్రేషన్’ చేసుకోవాలని సూచించారు. ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్రకటన ఉంటుందని వెల్లడించారు.