News September 1, 2024
ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌తో ముందుకెళ్తున్నాం: సీఎం చంద్రబాబు

AP: రాష్ట్రంలో 1998 తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఇప్పుడు భారీ వర్షాలు కురిశాయని సీఎం చంద్రబాబు చెప్పారు. ‘శ్రీశైలం, సాగర్, పులిచింతలతో పాటు మున్నేరు, బుడమేరు నుంచి భారీగా వరద వస్తోంది. బుడమేరు నుంచి కొల్లేరుకు వెళ్లాల్సిన నీళ్లు విజయవాడకు వచ్చాయి. వరద బాధితులు రెండున్నర లక్షల మంది ఉన్నారు. వారందరికీ ఆహారం, తాగునీరు, పాలు అందించాలని ఆదేశించా. ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌తో ముందుకెళ్తున్నాం’ అని తెలిపారు.
Similar News
News March 3, 2026
నేడే చంద్రగ్రహణం.. ఎప్పుడు చూడొచ్చంటే?

ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభం కానుంది. అయితే మన దేశంలో ఈ గ్రహణం చివరి దశలో ఉన్నప్పుడే కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలవారు సాయంత్రం 6.20 నుంచి 6.47 వరకు గ్రహణాన్ని చూడొచ్చు. కాగా గ్రహణం సందర్భంగా ఈరోజు ప్రధాన ఆలయాలు అన్ని మూతపడతాయి. ఇక భారత్ సహా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, అమెరికాలోనూ కనిపిస్తుంది.
News March 3, 2026
తమ్మినేనిపై సీపీఎం అభిశంసన

TG: CPM సీనియర్ నేత తమ్మినేని వీరభద్రాన్ని పార్టీ కేంద్ర కమిటీ అభిశంసింది. ఆయన రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సమయంలో లాబీయింగ్, ప్రలోభాలు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారంది. ఇది రాష్ట్ర కమిటీ నిట్టనిలువునా చీలడానికి దారితీసిందని ఆగ్రహించింది. తమ్మినేనితో పాటు కమిటీ సభ్యులు స్కైలాబ్ బాబు, ప్రసాద్ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని, వారిచ్చిన వివరణల్లోనూ ఆత్మవిమర్శ లోపించిందంటూ అభిశంసన చర్యలు చేపట్టింది.
News March 3, 2026
ఈ ప్రధాన పంటలకు ఈ ఎర పంటలతో మేలు

☛ వరి చుట్టూ జీలుగ వేసి కాండం తొలిచే పురుగు ఉద్ధృతి తగ్గించవచ్చు. ☛ మొక్కజొన్న చుట్టూ జొన్న మొక్కలను నాటి మొవ్వు ఈగ, కాండం తొలిచే పురుగును కట్టడి చేయొచ్చు. ☛ చెరకు పంట చుట్టూ కుంకుమ బంతి, సోయా చిక్కుడు వేసి నులి పురుగులను నివారించవచ్చు. ☛ పొగాకు చుట్టూ ఆముదం పంట వేసి పొగాకు లద్దె పురుగులను నియంత్రించవచ్చు. ☛ మిరప చుట్టూ ఆముదం పంట వేసి కాయతొలుచు పురుగులను కట్టడి చేయొచ్చు.


