News April 7, 2025
ఐటీ నోటీసులకు భయపడం: పృథ్వీరాజ్ తల్లి

రెమ్యునరేషన్ వివరాలు వెల్లడించాలని దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌కు ఐటీ నోటీసులు రావడంపై ఆయన తల్లి మల్లిక స్పందించారు. తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని, దర్యాప్తునకు భయపడేది లేదని చెప్పారు. అంతకుముందు సినిమా విషయంలో వివాదం చెలరేగగా పృథ్వీరాజ్‌కు స్టార్ హీరో మమ్ముట్టి అండగా ఉండటం తనను కదిలించిందని తెలిపారు. తన కొడుకుకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.
Similar News
News September 13, 2025
IPSల బదిలీలు.. ఈ జిల్లాలకు కొత్త ఎస్పీలు

AP: ఏపీ ప్రభుత్వం ఐపీఎస్‌లను బదిలీ చేసింది. గుంటూరు-వకుల్ జిందాల్, పల్నాడు-డి.కృష్ణారావు, ప్రకాశం-హర్షవర్ధన్ రాజు, చిత్తూరు-తుషార్ డూడీ, సత్యసాయి-సతీశ్ కుమార్, కృష్ణా-విద్యాసాగర్ నాయుడు, విజయనగరం-ఏఆర్ దామోదర్, నంద్యాల-సునీల్ షెరాన్, అంబేడ్కర్ కోనసీమ- రాహుల్ మీనా, కడప-నచికేత్, అన్నమయ్య-ధీరజ్ కునుగిలి, తిరుపతి-సుబ్బారాయుడు, నెల్లూరు-అజితా వేజెండ్ల, బాపట్ల-ఉమామహేశ్వర్‌ను నియమించింది.
News September 13, 2025
తగ్గిన సబ్బులు, షాంపూల ధరలు

GST సవరణ నేపథ్యంలో ప్రముఖ FMCG బ్రాండ్ హిందుస్థాన్ యూనిలీవర్ (HUL) తమ ఉత్పత్తుల ధరలు తగ్గించింది. రూ.490 ఉండే డవ్ షాంపూ(340ml) రూ.435కే లభించనుంది. రూ.130 హార్లిక్స్ జార్(200g) రూ.110, రూ.68 లైఫ్‌బాయ్ సబ్బు(75gX4) రూ.60, రూ.96 లక్స్ సబ్బు(75gX4) రూ.85, రూ.300 బ్రూ (75g) రూ.284, రూ.124 బూస్ట్(200g) రూ.110, రూ.154 క్లోజప్ (150g) రూ.129కే అందుబాటులో ఉంటాయి. ఈ నెల 22 నుంచి ఈ ధరలు అమలవుతాయి.
News September 13, 2025
హైదరాబాద్ మిధానీలో ఉద్యోగాలు

HYDలోని మిశ్ర ధాతు నిగమ్<