News April 4, 2025
మీ పిట్ట బెదిరింపులకు భయపడం: హరీశ్ రావు

TG: HCU భూముల విషయంలో నిలదీసినందుకు విద్యార్థులు, BRS నేతలు, సోషల్ మీడియా వారియర్స్పై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని BRS MLA హరీశ్ మండిపడ్డారు. వెంటనే కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ‘ఇలా ఎంత మందిపై కేసులు పెట్టుకుంటూ వెళ్తారు రేవంత్ గారు? ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ఇదేం ఇందిరమ్మ రాజ్యం? మీ పిట్ట బెదిరింపులకు భయపడం’ అని ట్వీట్ చేశారు.
Similar News
News April 10, 2025
రైతుల కోసం కొత్త పథకం: మంత్రి తుమ్మల

TG: రైతుల కోసం ‘గ్రామ గ్రామానికి జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నాణ్యమైన విత్తనం’ పథకాన్ని తీసుకొస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. జూన్లో CM రేవంత్ ఈ స్కీమ్ను ప్రారంభిస్తారని తెలిపారు. ప్రతి గ్రామంలో ముగ్గురు నుంచి ఐదుగురు రైతులకు జూన్ మొదటి వారంలో ఈ పథకం కింద విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. సుమారు 40వేల మంది రైతులకు 2500-3500 క్వింటాళ్ల విత్తనాలను అందజేస్తామన్నారు.
News April 10, 2025
మార్కుల గొడవలో కూతురిని చంపిన తల్లికి జీవితఖైదు

పరీక్షల్లో ఎక్కువ మార్కులు వచ్చాయని అబద్ధం చెప్పిన కూతురిని చంపిన కేసులో తల్లికి బెంగళూరు సిటీ కోర్టు జీవితఖైదు విధించింది. తనకు సెకండ్ పీయూ ఫైనల్ పరీక్షల్లో 95% మార్కులు వచ్చాయని సాహితి తన తల్లి పద్మినితో చెప్పింది. ఆ తర్వాతి రోజే ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యానని చెప్పింది. తల్లి సపోర్ట్ లేకపోవడం వల్లే ఇలా జరిగిందని కోప్పడింది. దీంతో గతేడాది ఏప్రిల్ 29న పద్మిని కోపంతో సాహితిని చంపింది.
News April 10, 2025
ఇండియాకు రాణా.. NIA స్టేట్మెంట్ రిలీజ్

ముంబై ఉగ్రదాడి కేసు నిందితుడు తహవూర్ రాణాపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. పలు కేంద్ర సంస్థల సహకారంతో రాణాను విజయవంతంగా ఇండియాకు రప్పించామని పేర్కొంది. ‘భారత్-అమెరికా ఒప్పందంతో తహవూర్ రాణాను తీసుకువచ్చాం. పలు ఉగ్ర సంస్థలతో కలిసి ముంబై ఉగ్రదాడికి రాణా కుట్ర చేశాడు. పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థలతో అతడు చేతులు కలిపాడు. ముంబై మారణహోమంలో 166 మంది చనిపోయారు’ అని తెలిపింది.