News July 7, 2024
మేం ముస్లింలకు వ్యతిరేకం కాదు: ఎంపీ లక్ష్మణ్

TG: తాము ఓటు బ్యాంకు రాజకీయాలకే వ్యతిరేకం తప్ప ముస్లింలకు కాదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. మైనారిటీల హక్కుల్ని కాంగ్రెస్ కాలరాస్తోందని ఆరోపించారు. ‘మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకం. వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కాంగ్రెస్ యత్నిస్తోంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారని ఆయన తెలిపారు.
Similar News
News January 20, 2026
ఎల్బీనగర్ మెట్రోలో GOOD ‘మెసేజ్’

ఎప్పుడూ బిజీగా ఉండే మెట్రోలో మంగళవారం ఓ వింత దృశ్యం కనిపించింది. ఎల్బీనగర్ వెళ్లే రైలులో ఎవరో ఒక ‘జెన్-జీ’ కుర్రాడో, అమ్మాయో అతికించిన గ్రీన్ స్టిక్కీ నోట్స్ ప్రయాణికుల మనసు గెలుచుకుంటున్నాయి. “ప్రతిఫలం ఆశించకుండా సాయం చెయ్.. నీ మనసు చెప్పిందే విను” అంటూ డయానా చెప్పిన మంచి మాటలను ఆ నోట్స్‌పై రాశారు. యాంత్రికమైన ఈ కాలంలో నలుగురికి మంచిని పంచాలనే ఈ చిన్న ప్రయత్నం ప్రయాణికుల్లో నవ్వులు పూయించింది.
News January 20, 2026
జోగి సోదరులకు బెయిల్

AP: కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్, ఆయన సోదరుడు జోగి రాముకు బెయిల్ మంజూరైంది. భవానీపురంలో నమోదైన కేసులో బెయిల్ లభించగా, మొలకలచెరువు కేసులో ఆయన రిమాండ్ కొనసాగుతోంది. ప్రస్తుతం వీరిద్దరూ విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.
News January 20, 2026
4 గంటలుగా కొనసాగుతున్న హరీశ్ విచారణ

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పీఎస్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు విచారణ కొనసాగుతోంది. సుమారు 4 గంటలకుపైగా సిట్ అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఓ ప్రైవేటు ఛానెల్ ఎండీ స్టేట్‌మెంట్ ఆధారంగా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. వాటికి హరీశ్ కూడా దీటుగా సమాధానం ఇస్తున్నట్లు సమాచారం. అటు మాజీ మంత్రి విచారణపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు.


