News July 2, 2024

హిండెన్‌బర్గ్‌తో మాకు సంబంధం లేదు: కోటక్ గ్రూప్

image

అదానీ గ్రూప్ షేర్ల షార్ట్ సెల్లింగ్‌లో హిండెన్‌బర్గ్‌‌కు చెందిన ఇన్వెస్టర్లకు సహకరించిందన్న ఆరోపణలను కోటక్ గ్రూప్ తోసిపుచ్చింది. హిండెన్‌బర్గ్‌తో తమ సంస్థలైన K-ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్, KMILకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ‘క్లైంట్‌గా లేదా ఇన్వెస్టర్‌గా హిండెన్‌బర్గ్‌కు మా సంస్థతో సంబంధం లేదు. మా ఇన్వెస్టర్లలో ఎవరితోనైనా హిండెన్‌బర్గ్ పార్ట్‌నర్‌గా ఉందనే విషయం తెలియదు’ అని పేర్కొంది.

Similar News

News October 12, 2024

చరిత్ర సృష్టించిన భారత్

image

ఉప్పల్ స్టేడియంలో టీమ్ ఇండియా రికార్డుల మోత మోగించింది.
*టెస్టు హోదా ఉన్న జట్టు టీ20ల్లో చేసిన అత్యధిక స్కోర్ ఇదే (297)
*టీ20ల్లో టీమ్ ఇండియాకు ఇదే హయ్యెస్ట్ స్కోర్ (297)
*భారత్ ఇన్నింగ్సులో అత్యధిక సిక్సర్లు (22)
*భారత టీమ్ తరఫున ఫాస్టెస్ట్ 100- 7.2 ఓవర్లలో
*భారత టీమ్ తరఫున ఫాస్టెస్ట్ 200- 13.6 ఓవర్లలో

News October 12, 2024

నాకు ఆ సమస్య ఉంది: ఆలియా భట్

image

తనకు ఆరోగ్యపరంగా ఉన్న సమస్య గురించి బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. ‘మా కూతురు రాహా ఫొటోను షేర్ చేయడంపై ఆసక్తి ఉండేది కాదు. తను ఇన్‌స్టాలో రీల్ కావడం నాకిష్టం లేదు. రాహాతో కలిసి ఫొటో దిగుదామని రణ్‌బీర్ అన్నప్పుడు కంగారుపడ్డా. ఎందుకంటే ప్రతి క్షణం నేను ఆందోళనకు గురవుతా. కొన్నిసార్లు అది తీవ్రంగా ఉంటుంది. రణ్‌బీర్ నా సమస్యను అర్థం చేసుకుని ప్రవర్తిస్తుంటాడు’ అని తెలిపారు.

News October 12, 2024

కశ్మీరీ పండిట్లకు ఫరూక్ అబ్దుల్లా కీలక వినతి

image

కశ్మీర్ వ్యాలీ నుంచి వలస వెళ్లిపోయిన పండిట్లు తిరిగి స్వస్థలాలకు రావాల్సిందిగా ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా పిలుపునిచ్చారు. నేషనల్ కాన్ఫరెన్స్‌ను శ‌త్రువులా భావించ‌వ‌ద్ద‌ని కోరారు. ‘వెళ్లిపోయిన వారు తిరిగి రావ‌డానికి స‌మ‌యం వ‌చ్చేసింది. మేము కేవ‌లం క‌శ్మీరీ పండిట్ల గురించే కాకుండా జ‌మ్మూ ప్ర‌జ‌ల గురించి కూడా ఆలోచిస్తాం. మ‌నం అంద‌రం భార‌తీయులం. అంద‌రినీ క‌లుపుకొని ముందుకెళ్లాలి’ అని పేర్కొన్నారు.