News April 22, 2024
మేం సురక్షితంగా లేము.. బీజేపీ టార్గెట్ చేస్తోంది: మమతా బెనర్జీ

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నన్ను, నా మేనల్లుడు అభిషేక్ బెనర్జీని బీజేపీ టార్గెట్ చేస్తోంది. మేం సురక్షితం లేము. మాకు ముప్పు పొంచి ఉన్నప్పటికీ కమల పార్టీ కుట్రలకు భయపడం. TMC నాయకులంతా జాగ్రత్తగా ఉండాలి’ అని పిలుపునిచ్చారు. కాగా బీజేపీ నేత సువేందు అధికారి ఇటీవల మాట్లాడుతూ.. ‘సోమవారం పెద్ద విధ్వంసం జరగనుంది. అది TMCని, ఆ పార్టీ నేతలను షేక్ చేస్తుంది’ అని చెప్పారు.
Similar News
News March 17, 2026
అసెంబ్లీ ముందుకు గిగ్ వర్కర్ల బిల్లు!

TG: గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత, బీమా, ఆరోగ్య పథకాలు అందించే బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి ఆమోదం లభించేలా చేసి, మేడే లోపు చట్టాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ బిల్లు ద్వారా 3-4 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. HYDలో వెల్ఫేర్ బోర్డు, వారిని వ్యవస్థీకృత పరిధిలోకి తెచ్చేందుకు ప్రత్యేక సైట్, యాప్‌ను సర్కార్ సిద్ధం చేస్తోంది.
News March 17, 2026
విజయ్-రష్మిక హల్దీ వేడుకల ఫొటోలు.. వైరల్

గత నెలలో పెళ్లి చేసుకున్న విజయ్ దేవరకొండ-రష్మిక తమ హల్దీ వేడుక ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆ రోజు హల్దీ+హోలీ మాదిరిగా రంగుల్లో తడిసిపోయామని రష్మిక పేర్కొన్నారు. ఇప్పటికీ తన జుట్టు ఎరుపు రంగులోనే ఉందన్నారు. అద్భుతమైన వేడుకలకు సహకరించిన సిబ్బందికి థాంక్స్ చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.