News December 30, 2024

భద్రత విషయంలో మనకు అంత అదృష్టం లేదు: రాజ్‌నాథ్

image

భద్రత విషయంలో నిశ్చింతగా ఉండే అదృష్టం భారత్‌కు లేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. సైన్యం నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిందేనని వివరించారు. ‘ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌కు భద్రతపరంగా రిలాక్స్ అయ్యే పరిస్థితి లేదు. అటు రెండు వైపులా సరిహద్దుల్లో, ఇటు అంతర్గత శత్రువులతో నిరంతరం పోరాటం తప్పదు. శత్రువులు మనల్ని ఎప్పుడు ఎలా దెబ్బతీయాలా అని ఎప్పుడూ చూస్తూనే ఉంటారు’ అని పేర్కొన్నారు.

Similar News

News December 12, 2025

ఘోర ప్రమాదానికి కారణాలేంటి?

image

AP: అల్లూరి(D)లో జరిగిన బస్సు <<18539495>>ప్రమాదానికి<<>> గల కారణాలపై పోలీసులు ఓ అంచనాకు రాలేకపోతున్నారు. మలుపు దగ్గర డ్రైవర్ బస్సును కంట్రోల్ చేయలేకపోయారా? ఘాట్ రోడ్డులో జర్నీ డ్రైవర్‌కు కొత్త కావడం వల్లే బోల్తా కొట్టిందా? దట్టమైన పొగమంచుతో దారి కనిపించలేదా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సిగ్నల్ లేని ప్రాంతం కావడంతో బాధితులు 108కి ఫోన్‌ చేయడం ఆలస్యమైంది. అంబులెన్సులు ప్రమాదస్థలికి వెళ్లడంలోనూ లేటయ్యింది.

News December 12, 2025

INDvsSA.. 5 పరుగులు, 5 వికెట్లు

image

SAతో రెండో టీ20లో IND 162 పరుగులకు ఆలౌటై 51 రన్స్ తేడాతో <<18539012>>ఓడింది<<>>. చివరి 5 వికెట్లను 5 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. 8 బంతుల్లో 5 వికెట్లు పడ్డాయి. 157 రన్స్ వద్ద 6, 158 వద్ద 7, 162 వద్ద 8, 9, పదో వికెట్ పడింది. అభిషేక్(17), గిల్(0), SKY(5), తొలి టీ20లో అదరగొట్టిన హార్దిక్ (23 బంతుల్లో 20) స్థాయికి తగ్గట్లుగా ఆడకపోవడం, స్పిన్నర్లను బాగా ఆడే దూబేను 8వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం INDను దెబ్బతీసింది.

News December 12, 2025

ప్రెగ్నెన్సీకి ముందు ఏ టెస్టులు చేయించుకోవాలంటే..

image

ప్రతి మహిళ ప్రెగ్నెంట్ అయ్యే ముందు కొన్ని ఆరోగ్య పరీక్షలు కచ్చితంగా చేయించుకోవాలంటున్నారు నిపుణులు. వాటిల్లో ముఖ్యమైనవి రూబెల్లా, చికెన్ పాక్స్, HIV, హెర్సస్, హెపటైటిస్ B, థైరాయిడ్, జన్యు పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలి. వీటితో పాటు గవదబిళ్లలు, మీజిల్స్, రుబెల్లా టీకాలు కచ్చితంగా తీసుకోవాలి. అలాగే మానసిక ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి మెంటల్ హెల్త్ చెకప్ కచ్చితంగా చేయించుకోవాలని సూచిస్తున్నారు.