News January 7, 2025

మేము ఎవరినీ టార్గెట్ చేయట్లేదు: మంత్రి పొంగులేటి

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరినీ టార్గెట్ చేయడం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఎలాంటి తప్పు చేయకపోతే కేటీఆర్ కోర్టుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. తప్పులు చేశారు కాబట్టే అన్నీ బయటపడుతున్నాయని చెప్పారు. జైలుకు వెళ్తే సీఎం అవుతారని అనుకుంటే కేటీఆర్ కంటే కవిత ముందు ఉంటారని చెప్పారు. కొత్త ఏడాదిలో కేటీఆర్‌కు స్పిరిట్ పెరిగిందని సెటైర్లు వేశారు.

Similar News

News January 8, 2025

ALERT.. ఇవాళ రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రతలు

image

TG: ఇవాళ రాత్రి ఉష్ణోగ్రతలు ఈ నెలలోనే కనిష్ఠానికి పడిపోతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. రేపు ఉదయం నార్త్ HYDలో 5-7 డిగ్రీ సెల్సియస్, వెస్ట్ HYDలో 7-9 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుందని తెలిపారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలోని ఇతర జిల్లాల్లోనూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి.

News January 8, 2025

తెలంగాణలో కింగ్‌ఫిషర్ బీర్లు బంద్: క్రాషైన కంపెనీ షేర్లు

image

TGకి కింగ్‌ఫిషర్ సహా <<15097668>>బీర్ల<<>> సరఫరాను సస్పెండ్ చేయడంతో యునైటెడ్ బ్రూవరీస్ షేర్లు ఇంట్రాడేలో 4% మేర పతనమయ్యాయి. 2019 నుంచి కనీస ధరలను పెంచకపోవడమే ఇందుకు కారణం. TG నుంచి రూ.900 కోట్ల బకాయిలు రావాల్సి ఉండటం వర్కింగ్ క్యాపిటల్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. 6 నెలలుగా చెల్లింపులు చేయలేదన్న సమాచారం ఎక్స్‌ఛేంజీలకు చెప్పడంతో రూ.1920 వద్ద కనిష్ఠాన్ని తాకిన షేర్లు చివరికి రూ.73నష్టంతో రూ.2001 వద్ద ముగిశాయి.

News January 8, 2025

మోదీజీ అమరావతికి రండి: సీఎం చంద్రబాబు

image

AP: మోదీని స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధిలో నిత్యం ముందుకెళ్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. త్వరలో అమరావతికి రావాలని మోదీని సీఎం ఆహ్వానించారు. ఏ సమస్య చెప్పినా మోదీ వెంటనే అర్థం చేసుకుంటారని, వెంటనే పనులు జరిగేలా చొరవ చూపిస్తారని కొనియాడారు. గతంలో ఏ ప్రధాని కూడా ఇంత చొరవ తీసుకోలేదని పేర్కొన్నారు. నదుల అనుసంధానం తమ లక్ష్యమని, ఇందుకు కేంద్రం సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.