News December 9, 2024
మేం దేశభక్తులం, యాంటీ ఇండియాకు వ్యతిరేకం: కాంగ్రెస్

BJPవి డార్క్ వెబ్కు పరిమితమైన డార్క్ ఫాంటసీస్ అని కాంగ్రెస్ MP కార్తీ చిదంబరం అన్నారు. డీప్స్టేట్పై వచ్చేవన్నీ కుట్ర సిద్ధాంతాలని కొట్టిపారేశారు. ‘సోనియా గాంధీ, సొరోస్ మధ్య లింక్స్ సీరియస్ మ్యాటర్. దేశ వ్యతిరేక శక్తులపై ఏకమై పోరాడాలి’ అన్న <<14829726>>కిరణ్ రిజిజు<<>>పై మండిపడ్డారు. ‘భారత సమగ్రత, సార్వభౌమత్వానికి మేం కట్టుబడతాం. మేం దేశభక్తులం, జాతీయవాదులం’ అని స్పష్టం చేశారు. SP, RJD MPలూ ఇలాగే స్పందించారు.
Similar News
News October 26, 2025
ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలి: అనిత

AP: ‘మొంథా’ తుఫాను నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. ’27, 28, 29 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర గాలులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలి. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలి. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా చూడాలి’ అని అధికారులతో సమీక్షలో సూచించారు.
News October 26, 2025
జూబ్లీహిల్స్లో ‘కారు’ను పోలిన ఫ్రీ సింబల్స్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BRSకు ఫ్రీ సింబల్స్తో తిప్పలు తప్పేలా లేవు. ఇండిపెండెంట్లకు EC కెమెరా, చపాతీ రోలర్, రోడ్ రోలర్, సోప్ డిష్, టీవీ, షిప్ వంటి ఫ్రీ సింబల్స్ కేటాయించింది. ఇవి కారును పోలి ఉంటాయనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో నెలకొంది. ఇలాంటి ఫ్రీ సింబల్స్ తొలగించాలని BRS ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేసింది. అయితే ఈసారి అభ్యర్థి ఫొటో కూడా ఉండనుండటంతో ఈ ‘సింబల్ కన్ఫ్యూజన్’ అంతగా ఉండకపోవచ్చు.
News October 26, 2025
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

AP: ఇంటర్ విద్యార్థులు తమ పేరు, గ్రూప్, మీడియం తదితర వివరాలను చెక్ చేసుకునేందుకు ఇంటర్ విద్యా మండలి అవకాశం కల్పించింది. <


