News December 15, 2024
బీఆర్ఎస్ చేసిన అప్పులకు మేము వడ్డీ కడుతున్నాం: భట్టి

TG: రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై BRS తప్పుడు ప్రచారం చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. బీఆర్ఎస్ అప్పులు చేసి వదిలేస్తే, తమ ప్రభుత్వం వడ్డీలు కడుతోందని చెప్పారు. అప్పులపై కాంగ్రెస్ దగ్గర పక్కా లెక్కలు ఉన్నాయని, రేపు అసెంబ్లీలో అన్ని బయటపెడుతామన్నారు. తమ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.54 వేల కోట్లు అప్పులు చేసిందని పేర్కొన్నారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని సీఎం చెప్పారన్నారు.
Similar News
News November 24, 2025
సింగూరు డ్యామ్ ఎందుకు దెబ్బతిందంటే!

నగరానికి తాగునీరు అందించే సింగూరు జలాశయం ఇటీవల కాలంలో దెబ్బతింది. అధిక మోతాదులో నీటిని నిల్వ చేయడంతోనే ఈ సమస్య వచ్చింది. ప్రాజెక్ట్ డిజైన్ ప్రకారం 517.8 మీటర్ల వరకే నీటిని నిల్వ చేయాలి. అయితే గత ప్రభుత్వం మిషన్ భగీరథ కోసం నిల్వలను పెంచాలని ఆదేశించింది. దీంతో 522 మీటర్ల వరకు నీటిని నిల్వ చేస్తూ వస్తున్నారు. ఈ కారణంగా ప్రాజెక్టుపై ఒత్తిడి పెరిగి దెబ్బతింది. అందువల్లే మరమ్మతు చేయనున్నారు.
News November 24, 2025
‘Gambhir Go Back’.. నెటిజన్ల ఫైర్

గౌతమ్ గంభీర్ కోచ్ అయ్యాక టీమ్ ఇండియా ఆటతీరు దిగజారిందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. స్వదేశంలో జరిగే టెస్టుల్లోనూ ఇంత దారుణమైన బ్యాటింగ్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్ అయ్యామని, BGT సిరీస్ కోల్పోయామని గుర్తు చేస్తున్నారు. జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో పదేపదే మార్పులు ఎందుకని మండిపడుతున్నారు. గంభీర్ హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
News November 24, 2025
అరటి పంట పెరుగుదల, పండు నాణ్యత కోసం

అరటి మొక్కకు కొద్దిపాటి రసాయన ఎరువులతో పాటు ఎక్కువ మొత్తంలో సేంద్రియ ఎరువులను వేయడం వల్ల మొక్క ఎదుగుదలతో పాటు పండు నాణ్యత పెరుగుతుంది. 300 గ్రాముల భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో 5 కేజీల బాగా చిలికిన పశువుల ఎరువుతో కలిపి మొక్కలకు అందించాలి. 45 సెం.మీ పొడవు, వెడల్పు, లోతుతో గుంతలు తీసి అందులో ఈ ఎరువును వెయ్యాలి. భాస్వరం ఎరువులు పంట మొదటి దశలోనే అవసరం. తర్వాతి దశలో అవసరం ఉండదు.


