News May 3, 2024

మొగిలయ్యకు పెన్షన్ చెల్లిస్తున్నాం: సీఎం సీపీఆర్వో

image

TG: పద్మశ్రీ మొగిలయ్యకు క్రమం తప్పకుండా పెన్షన్ చెల్లిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి సీపీఆర్వో అయోధ్యరెడ్డి తెలిపారు. మార్చి 31న కూడా ఆయన ఖాతాలో రూ.20 వేల పెన్షన్ జమ అయినట్లు ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కవులు, కళాకారులను ఎప్పుడూ గౌరవిస్తుందని పేర్కొన్నారు. అయితే ఏప్రిల్‌లో పెన్షన్ కొంచెం ఆలస్యం అవుతుందని మొగిలయ్యకు ముందే ఫోన్ చేసి చెప్పినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News December 26, 2024

కోడలు శోభిత గురించి నాగార్జున ఏమన్నారంటే?

image

నాగ చైతన్యతో శోభిత ధూళిపాళ పరిచయం కంటే ముందే తనకు ఆమె తెలుసని నాగార్జున చెప్పారు. ఆమె ఎంతో కష్టపడి ఈస్థాయికి వచ్చారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తన కోడలి వ్యక్తిత్వం, పనిలో నిజాయితీని కొనియాడారు. ఆమె వర్క్‌లో క్వాంటిటీ కంటే క్వాలిటీని చూస్తారన్నారు. ఆమె ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారన్నారు. ‘చైతూ జీవితంలోకి శోభిత వచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నా. వారిద్దరూ ఎంతో ఆనందంగా ఉన్నారు’ అని పేర్కొన్నారు.

News December 26, 2024

టాలీవుడ్‌ను రేవంత్ టార్గెట్‌గా చేసుకున్నారు: అమిత్ మాలవీయ

image

CM రేవంత్ రెడ్డిపై BJP IT సెల్ చీఫ్ అమిత్ మాలవీయ తీవ్ర విమర్శలు గుప్పించారు. తన అదుపాజ్ఞల్లో ఉండనందుకు, డబ్బు ఇవ్వనందుకు తెలుగు సినీ పరిశ్రమపై రేవంత్ కక్షగట్టారని మండిపడ్డారు. ‘రేవంత్ నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ సర్కారు టాలీవుడ్‌ను లక్ష్యంగా చేసుకుంది. తెలుగు స్టార్లు, నిర్మాతలపై ప్రతీకారం తీర్చుకుంటోంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రేవంత్ సర్కారు చెడ్డపేరును మూటగట్టుకుంది’ అని విమర్శించారు.

News December 26, 2024

సినీ పరిశ్రమలో రాజకీయ జోక్యం ఉండొద్దు: భట్టి

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే సినీ ఇండస్ట్రీ హైదరాబాద్‌కు తరలివచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సినీ పరిశ్రమలో రాజకీయ జోక్యం ఉండొద్దన్నారు. సినీ ప్రముఖులతో భేటీలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రైజింగ్‌లా బిజినెస్ మోడల్‌ని తీసుకెళ్దామని పేర్కొన్నారు. తమది ప్రజా ప్రభుత్వమని చెప్పారు. డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రత క్యాంపెయిన్‌లో సినీ పరిశ్రమ కలిసి రావాలని పిలుపునిచ్చారు.