News March 25, 2024
వెంకీ-2 స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాం: శ్రీను వైట్ల

రవితేజ హీరోగా 2004లో వచ్చిన వెంకీ సినిమా ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించింది. ఇటీవలే ఆ సినిమాను రీరిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ లభించింది. కాగా వెంకీ సీక్వెల్‌పై తాజాగా మూవీ డైరెక్టర్ శ్రీను వైట్ల స్పందించారు. ‘వెంకీ రీరిలీజ్ తర్వాత ప్రేక్షుకుల స్పందన చూసి వెంకీ-2 చేయాలనిపించింది. స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాం. మళ్లీ అదే కాంబినేషన్‌లో సినిమా ఉంటుంది కానీ ఎప్పుడని చెప్పలేను’ అని ఆయన తెలిపారు.
Similar News
News December 17, 2025
దేవదేవుని లక్షణాలు – ఒకే శ్లోకంలో

వేద్యో వైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః|
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః||
అన్నీ తెలిసినవాడు, సకల విద్యలకు మూలమైనవాడు, నిత్యం జ్ఞానరూపంలో ఉండేవాడు, దుష్టులను సంహరించి ధర్మాన్ని రక్షించేవాడు, తత్త్వజ్ఞానానికి అధిపతి, లక్ష్మీదేవికి భర్త, మధురమైనవాడు, ఇంద్రియాలకు అందనివాడు, మాయలన్నిటికీ కారణభూతుడు, సృష్టి కార్యాలు చేయువాడు, అనంత శక్తి, గొప్ప సంపద కలవాడు.. ఆయనే శ్రీమహావిష్ణువు. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News December 17, 2025
కేంద్ర సంస్కృత వర్సిటీలో ఉద్యోగాలు.. అప్లైకి 3రోజులే ఛాన్స్

న్యూఢిల్లీలోని కేంద్ర <
News December 17, 2025
నాగార్జున ‘కేడి’ డైరెక్టర్ కేకే కన్నుమూత

టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. యువ దర్శకుడు కిరణ్ కుమార్(KK) అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘కేడి’ మూవీతో దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఆయన డైరెక్ట్ చేసిన ‘KJQ: కింగ్.. జాకీ.. క్వీన్’ షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. విడుదలకు ముందే KK మరణించారు.


