News March 13, 2025
వైకుంఠపురం డీపీఆర్ రూపొందిస్తున్నాం: మంత్రి

AP: వైకుంఠపురం బ్యారేజ్ పునర్నిర్మాణానికి డీపీఆర్ తయారు చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 15లక్షల క్యూసెక్కుల వరద నీటిని తట్టుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు పూర్తికావాల్సి ఉండేదని, కానీ 2019లో వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టును రద్దు చేసిందన్నారు. రాష్ట్రంలో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులను జగన్ ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేసిందని అసహనం వ్యక్తం చేశారు.
Similar News
News March 13, 2025
ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం

AP: రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. జనసేన నుంచి నాగబాబు, టీడీపీ నుంచి బీటీ నాయుడు, కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీజేపీ నుంచి సోము వీర్రాజు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
News March 13, 2025
చాహల్తో డేటింగ్ రూమర్స్: ఆర్జే మహ్వాష్ పోస్ట్ వైరల్

టీమ్ ఇండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహల్తో డేటింగ్ రూమర్స్ వేళ ఆర్జే మహ్వాష్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘నేను ఈ స్థాయికి రావడం చూసి చిన్ననాటి మహ్వాష్ ఎంతో గర్విస్తోంది. నాకు కావాల్సింది కూడా ఇదే. మనం ఏ తప్పు చేయకుండా, అనవసర విషయాలు పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగాలి’ అని పోస్టులో రాశారు. డేటింగ్పై వస్తున్న రూమర్స్పైనే ఆమె ఈ పోస్ట్ పెట్టినట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
News March 13, 2025
అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత

తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్తత నెలకొంది. జగదీశ్ రెడ్డి సస్పెన్షన్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. దీంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు రేపు రాష్ట్రవ్యాప్త నిరసనకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ దిష్టిబొమ్మలు దహనం చేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.