News September 8, 2024

పాక్‌తో సంధికి సిద్ధంగానే ఉన్నాం కానీ…: రాజ్‌నాథ్

image

పాకిస్థాన్‌తో సంధికి భారత్ సిద్ధంగానే ఉందని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘వారితో మంచి బంధం మాకూ ఇష్టమే కానీ ముందు వారు ఉగ్రవాదాన్ని ఆపాలి. అప్పుడు కచ్చితంగా సంబంధాలు పునరుద్ధరిస్తాం. స్నేహితుల్ని మార్చుకోగలం కానీ ఇరుగుపొరుగువారిని మార్చుకోలేం కదా. పాక్ ఉగ్రవాదం కారణంగా ముస్లింలే ఎక్కువగా చనిపోయారు’ అని పేర్కొన్నారు.

Similar News

News December 5, 2025

TG న్యూస్ రౌండప్

image

* కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్‌పై అభిప్రాయాలు సేకరించేందుకు రేపు తెలంగాణ భవన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. దీనికి KTR హాజరవుతారు: బోయినపల్లి వినోద్
* కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇన్‌ఛార్జ్ VCగా డా.రమేష్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది.
* HYD శామీర్‌పేటలో ఓ కారు టైర్లు, సీట్ల కింద ₹4Cr నగదును పోలీసులు గుర్తించారు. హవాలా ముఠాను అరెస్టు చేసి విచారిస్తున్నారు.

News December 5, 2025

గాంధీ చూపిన మార్గమే స్ఫూర్తి: పుతిన్

image

భారత్-రష్యా బలమైన బంధానికి గాంధీ చూపిన అహింసా మార్గమే స్ఫూర్తి అని రాజ్‌ఘాట్ సందర్శకుల పుస్తకంలో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ రాసుకొచ్చారు. శాంతి, అభివృద్ధికి ఆయన చూపిన మార్గం భవిష్యత్తు తరాలను ఇన్‌స్పైర్ చేస్తూనే ఉంటుందన్నారు. జీవితాన్ని భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి అంకితం చేశారని, అహింసకు చిహ్నంగా మారారని రాశారు. ద్వైపాక్షిక వాణిజ్యం, దౌత్య సంబంధాలపై చర్చించడానికి పుతిన్ భారత పర్యటనకు వచ్చారు.

News December 5, 2025

భారీగా పెరిగిన విమాన టికెట్ ధరలు

image

ఇండిగో విమానాలు <<18473431>>రద్దు<<>> కావడంతో మిగతా ఎయిర్‌లైన్స్ ఈ సందర్భాన్ని ‘క్యాష్’ చేసుకుంటున్నాయి. వివిధ రూట్లలో టికెట్ ధరలను భారీగా పెంచాయి. హైదరాబాద్-ఢిల్లీ ఫ్లైట్ టికెట్ రేట్ రూ.40వేలకు చేరింది. హైదరాబాద్-ముంబైకి రూ.37వేలుగా ఉంది. సాధారణంగా ఈ రూట్ల టికెట్ ధరలు రూ.6000-7000 మధ్య ఉంటాయి. అటు ఢిల్లీలో హోటల్ గదుల రేట్లు కూడా అమాంతం పెరిగిపోవడంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు.