News February 7, 2025
బీసీలకు 42శాతం సీట్లు ఇచ్చేందుకు మేం సిద్ధం: పొన్నం
TG: ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న కులగణనను తమ ప్రభుత్వం పక్కాగా పూర్తి చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ‘బీసీలకు 42 శాతం సీట్లు ఇచ్చేందుకు మా పార్టీ సిద్ధం. వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరగనివ్వం. కులగణనను దేశం మొత్తం చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. BRS నేతలు సర్వేలో పాల్గొనలేదు. పైగా అవహేళన చేశారు. వెనుకబడిన వర్గాలకు ఆ పార్టీ క్షమాపణలు చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
Similar News
News February 7, 2025
సెలవు ఇవ్వలేదని…
ఆఫీస్‌లో సెలవు ఇవ్వలేదని నలుగురు సహోద్యోగులను పొడిచిన ఘటన బెంగాల్‌లోని కోల్‌కతాలో జరిగింది. అమిత్ కుమార్ సర్కార్ విద్యాశాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. నిన్న అతడు లీవ్ కోసం అప్లై చేయగా రిజెక్ట్ అయింది. ఈ విషయంపైనే తోటి ఉద్యోగులతో వాగ్వాదానికి దిగిన అతడు కత్తితో నలుగురిపై దాడి చేశాడు. అనంతరం కత్తి, రక్తం మరకలతో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
News February 7, 2025
ఆపరేషన్ టైగర్: శిండే గూటికి ఠాక్రే ఎంపీలు!
మహారాష్ట్రలో ‘ఆపరేషన్ టైగర్’ హాట్‌టాపిక్‌గా మారింది. ఉద్ధవ్ ఠాక్రే SSUBT 9 మంది ఎంపీల్లో ఆరుగురు శిండే శివసేనలో చేరబోతున్నారని సమాచారం. ఇప్పటికే చర్చలు ముగిశాయని, వచ్చే పార్లమెంటు సెషన్‌లోపు వీరు చేరడం ఖాయమేనని తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్రాల్లో NDA అధికారంలో ఉండటం, ఐదేళ్ల వరకు నిధులు లేకుండా మనుగడ కష్టమవ్వడమే ఇందుకు కారణాలని టాక్. 2/3 వంతు MP/MLAలు మారితే పార్టీ మార్పు నిరోధక చట్టం వర్తించదు.
News February 7, 2025
టాటా ఆస్తిలో రూ.500 కోట్లు.. ఎవరీ మోహన్ దత్తా?
వ్యాపార దిగ్గజం రతన్ టాటా తన వీలునామాలో రూ.500 కోట్లు మోహినీ మోహన్ దత్తా అనే వ్యక్తికి రాశారు. ఆ పేరు తాజాగా బయటికి రావడంతో ఆయన ఎవరన్న ఆసక్తి నెలకొంది. ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు చెందిన దత్తా ఒకప్పుడు స్టాలియన్ అనే ట్రావెల్ ఏజెన్సీకి యజమాని. దాన్ని టాటా గ్రూప్‌లో కలిపేశారు. టాటాతో మోహన్‌కు 60 ఏళ్ల స్నేహముందని జంషెడ్‌పూర్‌వాసులు చెబుతుంటారు. ఆ స్నేహంతోనే భారీ మొత్తాన్ని ఇచ్చారని తెలుస్తోంది.