News May 5, 2024
కూటమికే మద్దతిస్తున్నాం: మందకృష్ణ మాదిగ

AP: జగన్ పాలనలో దళితులకు అన్యాయం జరిగిందని MRPS అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ‘దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసే స్థాయికి దాడుల తీవ్రతను పెంచారు. ఈ కేసు నిందితుడు అనంతబాబును CM వెంటపెట్టుకుని తిరుగుతున్నారు. దళితులకు శిరోముండనం కేసులో YCP MLC త్రిమూర్తులుకు శిక్ష పడితే ఆయన్ను సస్పెండ్ చేయలేదు. SC వర్గీకరణపై మోసం చేశారు. వర్గీకరణపై హామీ ఇవ్వడంతోనే NDA కూటమికి మద్దతిస్తున్నాం’ అని తెలిపారు.
Similar News
News February 9, 2026
బాలీవుడ్ హీరో స్టైల్లో బిల్డప్ ఇచ్చి.. అడ్డంగా దొరికిన నకిలీ IT ఆఫీసర్

బాలీవుడ్ హీరో స్టైల్లో ట్రేడర్లను బురిడీ కొట్టించాలని చూసిన ఓ నకిలీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌కు చెందిన విజయ్‌సింగ్ చౌహాన్ (51) సూరత్‌లోని టెక్స్టైల్ మార్కెట్లో సీనియర్ IT అధికారిగా బిల్డప్ ఇస్తూ ₹30లక్షలు డిమాండ్ చేసి ₹4 లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడు. పక్కనే ఉన్న హోటల్‌కు క్యాష్తో రమ్మన్నాడు. అయితే సదరు ట్రేడర్‌కు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
News February 9, 2026
ప్రెగ్నెన్సీలో కలయికలో పాల్గొంటే..

ప్రెగ్నెన్సీ పీరియడ్‌లో శృంగారంలో పాల్గొనడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే హై రిస్క్ జోన్లో ఉన్న మహిళలు శృంగారానికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వెజైనా సమస్యలు, కవలలు, గతంలో ప్రీమెచ్యూర్ డెలివరీ అయినవాళ్లు కూడా శృంగారానికి దూరంగా ఉండాలి. అలాగే ఇన్ఫెక్షన్, లైంగికంగా సంక్రమించే వ్యాధులతో బాధపడుతుంటే వాళ్లు కూడా కలయికకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
News February 9, 2026
T20WCలో నేడు..

T20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ కోల్‌కతా, కొలంబో, అహ్మదాబాద్ వేదికగా 3 మ్యాచ్‌లు జరగనున్నాయి.
* ఉ.11 నుంచి.. స్కాట్లాండ్vsఇటలీ
* మ.3 నుంచి.. జింబాబ్వేvsఒమన్
* రా.7 నుంచి.. దక్షిణాఫ్రికాvsకెనడా
LIVE: స్టార్‌స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్


