News December 2, 2024
ఏడాదిలో 50వేల ఉద్యోగాలు భర్తీ చేసిన తొలి రాష్ట్రం మనదే: రేవంత్

తెలంగాణ యువత ఉద్యమబాట పట్టి రాష్ట్రాన్ని సాధించుకుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. BRS ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో విఫలమైందని దుయ్యబట్టారు. స్వాతంత్ర్య భారతంలో ఏడాది వ్యవధిలోనే 50వేల ఉద్యోగాలు భర్తీ చేసిన తొలి రాష్ట్రంగా చరిత్ర సృష్టించామన్నారు. నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగ భర్తీ చేస్తామనే నమ్మకం తమ ప్రభుత్వంపై ఏర్పడిందని పేర్కొన్నారు.
Similar News
News November 20, 2025
పోలి పాడ్యమి ఎప్పుడు జరుపుకోవాలంటే..?

పోలి పాడ్యమిని నవంబర్ 21వ తేదీన(శుక్రవారం) జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ‘పాడ్యమి తిథి నవంబర్ 20 ఉదయం 10:30కి ప్రారంభమై, నవంబర్ 21 మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుంది. సూర్యోదయాన్ని పరిగణనలోకి తీసుకొని నవంబర్ 21నే పోలి పాడ్యమి నిర్వహించాలి. ఇక నవంబర్ 22, 2025 శనివారం తెల్లవారుజామున 4:35 నుంచి 6:00 గంటల వరకు దీపాలను నీటిలో వదలడానికి అనుకూల సమయం’ అని చెబుతున్నారు.
News November 20, 2025
ఫోన్‌పే టాప్!

మన దేశంలో యూపీఐ చెల్లింపుల్లో ఫోన్‌పే ఆధిపత్యం కొనసాగుతోంది. 45.47% మార్కెట్ షేర్‌తో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత గూగుల్ పే (34.62%), పేటీఎం (7.36%), Navi (2.78%), సూపర్ మనీ (1.28%) ఉన్నాయి. ఫోన్‌పే, గూగుల్ పే కలిపి 80 శాతానికి పైగా మార్కెట్ షేర్‌ను కలిగి ఉండటం విశేషం. BHIM, CRED లాంటి ప్లాట్‌ఫామ్స్ కూడా వినియోగిస్తున్నారు. మరి మీరు ఏది వాడుతున్నారో కామెంట్ చేయండి.
News November 20, 2025
తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ముర్ము పర్యటన

ఏపీ, తెలంగాణలో పలు కార్యక్రమాల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొననున్నారు. 22న పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో జరగనున్న సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు ఆమె హాజరవుతారని రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. తొలుత 21న హైదరాబాద్‌లో ‘భారతీయ కళామహోత్సవ్- 2025’ను రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. అనంతరం శనివారం పుట్టపర్తికి వెళ్లనున్నారు.


