News April 6, 2024
BRS పేరు మార్చే ఆలోచన చేస్తున్నాం: ఎర్రబెల్లి

BRS పేరును TRSగా మార్చే ఆలోచన చేస్తున్నామని ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తాను పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు. ఇక.. TRSను BRSగా మార్చిన తర్వాత ఆ పార్టీకి పెద్దగా కలిసి రావడం లేదనేది అందరికీ తెలిసిందే. కొత్త పేరుతో ప్రజల్లోకి వెళ్లలేకపోయామని పార్టీ నేతలు గతంలో బాహాటంగానే చెప్పారు. ‘TRS’తో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ ‘BRS’ అయ్యాక అధికారం కోల్పోయింది.
Similar News
News October 18, 2025
ఆరోగ్యకరమైన జుట్టుకు చిలగడదుంప

చిలగడదుంపను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా జుట్టు రాలడాన్ని ఇది అడ్డుకుంటుంది. చిలగడదుంపలో ఉండే బీటా-కెరోటిన్, విటమిన్ A, C, B, E, పొటాషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు జుట్టు రాలడం, పల్చబడటాన్ని తగ్గిస్తాయి. దీన్ని తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యకరమైన జుట్టు మీ సొంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
News October 18, 2025
పాకిస్థాన్ది అనాగరిక చర్య: రషీద్ ఖాన్

జనావాసాలపై పాక్ చేసిన వైమానిక దాడిని అఫ్గాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. ‘ఈ అనాగరిక, ఆటవిక చర్యలో మహిళలు, పిల్లలు, దేశానికి ప్రాతినిధ్యం వహించాల్సిన యువ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోయారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. ట్రై సిరీస్ నుంచి వైదొలగాలని అఫ్గాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నా. ఈ క్లిష్ట సమయాల్లో నా ప్రజల పక్షాన నిలబడతా’ అని ట్వీట్ చేశారు.
News October 18, 2025
యమ దీపం ఎలా పెట్టాలంటే..?

ధన త్రయోదశి నాడు వెలిగించే యమ దీపంలో నాలుగు వత్తులు, నాలుగు ముఖాలుగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. ‘ఈ దీపం కోసం.. నువ్వుల నూనె/ ఆవ నూనెను ఉపయోగించాలి. దీపాన్ని ఇంటి బయట దక్షిణ దిశలో ఉంచాలి. కుటుంబ సభ్యులందరూ దీర్ఘాయుష్షుతో, కష్టాల నుంచి విముక్తి పొందాలని యమధర్మరాజును ప్రార్థించాలి. ఈ దీపదానం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు నిలిచి, అకాల మరణ భయం తొలగిపోతుంది’ అని అంటున్నారు.