News June 5, 2024

ఎన్డీఏతోనే ఉన్నాం: చంద్రబాబు

image

కేంద్రంలో ఎవరికి మద్దతిస్తారనే విషయంపై టీడీపీ చీఫ్ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాజకీయాల్లో నాకు ఎంతో అనుభవం ఉంది. ఎన్నో రాజకీయ మార్పులను చూశా. ఇప్పుడు మేం ఎన్డీఏతోనే ఉన్నాం. ఇవాళ కూటమి మీటింగ్‌కు ఢిల్లీ వెళ్తున్నా. ఆ తర్వాత ఏమైనా మార్పులు ఉంటే మీకు(మీడియా) తప్పకుండా చెబుతా’ అని బాబు తెలిపారు.

Similar News

News February 10, 2026

పాక్ యూటర్న్ విలువ ₹1,500 కోట్లు!

image

భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్‌పై పాక్ యూటర్న్ తీసుకోవడంతో ICC సహా గ్లోబల్ బ్రాడ్‌కాస్టర్లకు దాదాపు ₹1,500 కోట్ల ఆదాయం మిగిలింది. మ్యాచ్ రద్దయి ఉంటే మీడియా పార్ట్‌నర్ అయిన జియోహాట్‌స్టార్‌కు ICC భారీ పరిహారం ఇవ్వాల్సి వచ్చేది. అలాగే 10 సెకన్ల యాడ్‌కు ₹25-40 లక్షల చొప్పున సుమారు ₹200-300 కోట్ల యాడ్ రెవెన్యూ పోయేది. స్పాన్సర్‌షిప్‌లు, డిజిటల్ ట్రాఫిక్, హోటల్ బుకింగ్‌ల రూపంలో మరింత లాస్ తప్పేది కాదు.

News February 10, 2026

తాబేలు ఉన్న ఉంగరాన్ని ధరిస్తే..?

image

జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆర్థిక కష్టాలు తొలగి, లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి తాబేలు ఉంగరం ధరించడం మంచిదని పండితులు చెబుతున్నారు. ‘ఈ ఉంగరాన్ని ముందుగా పాలు, గంగాజలంతో శుద్ధి చేయాలి. ముందుగా లక్ష్మీదేవి పాదాల చెంత ఉంచి పూజించాలి. గురువారం ఈ ప్రక్రియ పూర్తి చేసి, శుక్రవారం నాడు కుడిచేతి చూపుడు/మధ్య వేలుకు ధరించాలి. ఉంగరం పెట్టుకున్నప్పుడు తాబేలు ముఖం మీ వైపు ఉండేలా చూసుకోవాలి’ అని సూచిస్తున్నారు.

News February 10, 2026

216 గంటల భరతనాట్యంతో ప్రపంచ రికార్డు

image

కర్ణాటకలోని ఉడిపికి చెందిన 23 ఏళ్ల విదుషి దీక్ష భరతనాట్యం చేసి ప్రపంచ రికార్డును సృష్టించారు. 216 గంటల పాటు నిరంతరాయంగా భరతనాట్యం ప్రదర్శించి, తన 170 గంటల పాత రికార్డును బద్దలు కొట్టి, గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నారు. డాక్టర్ జి. శంకర్ మహిళా కళాశాల ఆడిటోరియంలో జరిగిన ఈ ప్రదర్శన సమయంలో ప్రతి మూడు గంటలకు కేవలం 15 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటూ ఆమె ఘనతను సాధించారు.