News February 22, 2025
ఆ 8 మందిని కాపాడేందుకు కృషి చేస్తున్నాం: మంత్రి

TG: నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంటలోని <<15543635>>SLBC<<>> టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులను ప్రాణాలతో రక్షించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ‘ఉ.8 గం.కు కార్మికులు లోపలికి వెళ్లారు. ఉ.8.30కి టన్నెల్ బోరింగ్ మిషన్ ఆన్ చేశారు. టన్నెల్లో ఒకవైపు నుంచి నీరు లీక్ అయ్యి మట్టి కుంగింది. టీబీఎం ఆపరేటర్ ప్రమాదాన్ని ముందే పసిగట్టి కొందరు కార్మికులను బయటకు పంపించారు’ అని చెప్పారు.
Similar News
News November 25, 2025
భద్రాద్రి: ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

EMRS స్కూల్/కాలేజీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం అప్లై చేసుకోవాలని ఐటీడీఏ పీఓ రాహుల్ తెలిపారు. బోధన, బోధనేతర సిబ్బందిని తాత్కాలిక ఉద్యోగులుగా నియమిస్తామన్నారు. టీజీటీ ఇంగ్లిష్-1, లైబ్రేరియన్-1, సెక్యూరిటీ గార్డ్ (పు)-24, ల్యాబ్ అటెండెంట్-1, మెస్ హెల్పర్ (పు)-12, కుక్ (పు)-2, స్వీపర్ (పు)-8, హౌస్ కీపింగ్ స్త్రీలు-3, గార్డినర్-2 ఉన్నాయని, డిసెంబర్ 10లోపు ఏదైనా EMRSలో అప్లై చేసుకోవాలన్నారు.
News November 25, 2025
రామ్, నేను ఒకే రాశిలో పుట్టాం: భాగ్యశ్రీబోర్సే

తాను కలిసి నటించిన హీరోల్లో రామ్‌తో వైబ్ కుదిరిందని హీరోయిన్ భాగ్యశ్రీబోర్సే అన్నారు. తమ ఇద్దరిది ఒకే రాశి(వృషభం) అని చెప్పారు. ‘నటిగా ప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది. ‘కాంత’ మూవీలో రోల్ ఛాలెంజింగ్‌గా అనిపించింది. షూటింగ్ లేని సమయాల్లో ఎక్కువగా ఫ్యామిలీతో గడుపుతా. మొబైల్ స్విచ్ఛాఫ్ చేసి ట్రెక్కింగ్‌కు వెళ్తా’ అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆమె నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా ఈ నెల 27న రిలీజ్ కానుంది.
News November 25, 2025
కావలి మాజీ MLAకు సర్జరీ.. జగన్ ట్వీట్

కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి అనారోగ్య కారణాలతో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని YCP అధినేత జగన్ ‘X’ వేదికగా ట్వీట్ చేశారు. ఇటీవల బెంగుళూరులో బైపాస్ సర్జరీ చేయించుకున్న రామిరెడ్డి ప్రతాప కుమార్ రెడ్డి విశ్రాంతి తీసుకుంటున్నారు.


