News December 18, 2024
రూ.76వేల కోట్లు ఇవ్వాలని అడిగాం: పవన్

AP: జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు ఇస్తామని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ పథకం అమలుకు ₹76వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు VJAలో జల్జీవన్ మిషన్ అమలుపై వర్క్షాప్లో తెలిపారు. ఈ పథకానికి అన్ని రాష్ట్రాలు ₹లక్ష కోట్లు అడిగితే, YCP ప్రభుత్వం ₹26వేల కోట్లే అడిగిందని ఆరోపించారు. ఈ స్కీంతో ప్రతి వ్యక్తికి 55 లీటర్ల నీళ్లు ఇచ్చి, ప్రధాని మోదీ కలను సాకారం చేస్తామన్నారు.
Similar News
News November 28, 2025
మరోసారి మెగా పీటీఎం

AP: మరోసారి మెగా పేరెంట్-టీచర్స్ మీట్ నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. DEC 5న జూనియర్ కాలేజీలతో పాటు 45వేల ప్రభుత్వ బడుల్లో ఈ ప్రోగ్రాం జరగనుంది. విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను చూపించి తల్లిదండ్రులతో క్లాస్ టీచర్ మాట్లాడనున్నారు. మంత్రి లోకేశ్ మన్యం జిల్లాలో నిర్వహించే మెగా పీటీఎంలో పాల్గొంటారు. గతేడాది మొదటిసారి, ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో రెండోది, వచ్చే నెల మూడో మెగా పీటీఎం జరగనుంది.
News November 28, 2025
వైకుంఠ ద్వార దర్శనం: లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వకపోతే..?

వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు ఉంటుంది. అందులో మొదటి 3 రోజులు మాత్రమే లక్కీ డిప్ ద్వారా భక్తులను ఎంపిక చేస్తారు. లక్కీ డిప్లో సెలక్ట్ అవ్వని భక్తులకు నిరాశ అనవసరం. JAN 2 – JAN 8వ వరకు రోజుకు 15K చొప్పున విడుదలయ్యే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు. వీటిని బుక్ చేసుకున్న అందరికీ వైకుంఠ ద్వారం గుండా దర్శనం లభిస్తుంది. ఇవి DEC 5న విడుదలవుతాయి. ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి.
News November 28, 2025
త్వరలో BSNLలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

త్వరలో <


