News July 4, 2024
12 కీలక అంశాలను పరిష్కరించాలని ప్రధానిని కోరాం: రేవంత్

TG: రాష్ట్ర పునర్విభజన చట్టంలో TG, AP మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి సహకరించాలని PM మోదీని కోరినట్లు CM రేవంత్ వెల్లడించారు. HYD- కరీంనగర్, HYD-నాగ్‌పూర్ మార్గాల్లో ఎలివేటెడ్ కారిడార్‌లు, రోడ్ల విస్తరణ, 13 రాష్ట్ర రహదారులను NHలుగా అప్‌గ్రేడేషన్, రాష్ట్రానికి అదనంగా మరో 29 IPS పోస్టులు, పెండింగ్ నిధుల విడుదల వంటి 12 కీలకమైన అంశాలను సత్వరం పరిష్కరించాలని కోరినట్లు <
Similar News
News March 19, 2026
ఇరాన్ అటాక్‌తో ఖతర్‌కు ₹9.3లక్షల కోట్ల నష్టం!

ఇరాన్ చేసిన దాడులతో ఖతర్ ఏటా $20 బిలియన్ల (₹1.86లక్షల కోట్లు) వార్షిక ఆదాయం కోల్పోయిందని ఖతర్ ఎనర్జీ సీఈవో వెల్లడించారు. దీని ప్రభావం ఐదేళ్ల పాటు ఉండి.. మొత్తం ₹9.3లక్షల కోట్ల ఆదాయం కోల్పోయామన్నారు. ఈ దాడులతో ఖతార్ LNG ఎగుమతి సామర్థ్యం 17% తగ్గిందని.. ఏటా 12.8 మిలియన్ టన్నుల ఉత్పత్తి తగ్గనుందని తెలిపారు. దీంతో లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ కుదుర్చుకున్న దేశాలకు LNG సరఫరా సవాల్‌గా మారిందన్నారు.
News March 19, 2026
అదృష్టం తెచ్చిన కూతురు..

‘ధురంధర్’తో బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ స్టార్‌డమ్ అమాంతం పెరిగింది. కొవిడ్ తర్వాత ఆయన తీసిన చిత్రాలు ఏవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయాయి. 2022లో జయేశ్‌భాయ్ జోర్దార్, సర్కస్, 2023లో రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. 2024లో రణ్‌వీర్, దీపికా పదుకొణె దంపతులకు పాప జన్మించింది. 2025లో డైరెక్టర్ ఆదిత్య ధర్ ‘ధురంధర్’ ప్రాజెక్టు రావడంతో రణ్‌వీర్ బ్లాక్‌బస్టర్ కొట్టారు.
News March 19, 2026
ఎల్లుండి రంజాన్.. రేపు సెలవు లేదు

AP: రేపు (మార్చి 20) ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సాధారణ పని దినం కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. <<19427809>>రంజాన్<<>> మార్చి 21న జరుపుకోవాలని మతపెద్దలు సూచించడంతో సెలవును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. శనివారం (మార్చి 21) పబ్లిక్ హాలిడే ఉంటుందని పేర్కొంది. అయితే శనివారం జరగాల్సిన పదోతరగతి ఇంగ్లిష్ ఎగ్జామ్ నిర్వహణపై ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.


