News November 7, 2024
₹13వేల కోట్ల రుణమాఫీ బాకీ ఉందని ధైర్యంగా చెబుతున్నాం: మంత్రి పొంగులేటి
TG: అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ‘రాష్ట్రం పీకల్లోతు అప్పుల్లో ఉన్నా ఎన్నో ఇబ్బందులు పడుతూ రైతును రాజును చేయాలనే సంకల్పంతో ₹18వేల కోట్ల పంట రుణం మాఫీ చేశాం. ఇంకా ₹13వేల కోట్లు మాఫీ చేయాల్సి ఉందని ధైర్యంగా చెబుతున్నాం. Decలోపు మాఫీ చేస్తాం’ అని వరంగల్ జిల్లాలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన సందర్భంగా మంత్రి అన్నారు.
Similar News
News November 7, 2024
బెల్టుషాపులపై మంత్రి కీలక ఆదేశాలు
AP: ఎక్సైజ్ శాఖ అధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష నిర్వహించారు. ఎమ్మార్పీ ఉల్లంఘనలు, బెల్టుషాపులను ఉపేక్షించవద్దని ఆదేశించారు. తప్పు చేసినవారు ఎవరైనా శిక్ష తప్పదనే సంకేతాలు ఇవ్వాలని సూచించారు. కల్తీ మద్యం రహిత రాష్ట్రంగా ఏపీని మారుద్దామని పిలుపునిచ్చారు. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందించాలని సూచించారు.
News November 7, 2024
ఈ నెల 19, 20న ఆర్టీసీ ఈయూ నిరసనలు
AP: ఉద్యోగ భద్రత సర్క్యులర్ యథావిధిగా అమలు చేయడంతో పాటు ఇతర డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నిరసనలు చేపట్టనుంది. ఈ నెల 19, 20న ప్రొటెస్ట్ చేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చింది. సిబ్బంది ఎర్రబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవ్వాలని సూచించింది. ఆర్టీసీ డిపోలు, వర్క్ షాప్‌ల వద్ద ధర్నాలు చేయాలని ఉద్యోగులకు సూచించింది.
News November 7, 2024
కాంగ్రెస్ పతనానికి 3 కారణాలు చెప్పిన సింధియా
కాంగ్రెస్ పార్టీ వేగంగా పతనమవుతోందని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. ‘ఎలాంటి సందేహం లేదు. కాంగ్రెస్ పట్టు తప్పింది. ఇందుకు 3 కారణాలు ఉన్నాయి. ఆ పార్టీలో నాయకత్వ సంక్షోభం మొదటిది. ప్రజలతో సంబంధాలు తెగిపోవడం రెండోది. భారతదేశ విజన్‌కు దూరమవ్వడం మూడోది. ఈ మూడూ లేనప్పుడు పార్టీని ప్రజలు నమ్మడం మానేస్తారు. ప్రస్తుతం దాని దుస్థితి ఇదే’ అని అన్నారు. 2020లో ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు.