News August 17, 2024
ఇంటింటికీ తిరిగి రుణమాఫీపై వివరాలు సేకరిస్తాం: KTR

TG: ఇంటింటికీ తిరిగి రుణమాఫీపై వివరాలు సేకరిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. పార్టీ నేతలతో భేటీ అనంతరం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ‘రాష్ట్రంలో 60శాతం మందికి రుణమాఫీ కాలేదు. ఎల్లుండి నుంచి వివరాలు సేకరిస్తాం. ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిని నియమిస్తాం. కలెక్టర్లకు నివేదికలు సమర్పిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం’ అని చెప్పారు.
Similar News
News November 26, 2025
విశాఖలో ఆత్మహత్య చేసుకున్న అల్లూరి విద్యార్థిని

అల్లూరి జిల్లా విద్యార్థిని విశాఖపట్నంలో బుధవారం ఆత్మహత్య చేసుకుంది. హుకుంపేట మండలం రాప గ్రామానికి చెందిన శోభ నందిని (19) కృష్ణా కాలేజీలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. మద్దిలపాలెంలో అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు పోలీసులు నందని కుటుంబ సభ్యులుకు సమాచారం తెలియజేశారు. మృతురాలి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు.
News November 26, 2025
‘పిశాచి 2’లో న్యూడ్ సీన్స్.. స్పందించిన హీరోయిన్

తాను నటించిన ‘పిశాచి 2’లో న్యూడ్ సీన్స్ ఉన్నాయంటూ వచ్చిన వార్తలపై తమిళ నటి ఆండ్రియా జెరేమియా స్పందించారు. సినిమాలో బోల్డ్ సీన్లు చాలానే ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. డైరెక్టర్ అడిగితే పాత్ర కోసం ఏదైనా చేస్తానని ఆమె చెప్పారు. ఆండ్రియా పిశాచి, సైంధవ్, తడాఖా వంటి సినిమాల్లో నటించారు. పిశాచి-2 విజయ్ సేతుపతి, ఆండ్రియా లీడ్ రోల్లో తెరకెక్కింది. కోర్టు కేసు కారణంగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది.
News November 26, 2025
ఫ్యాన్సీ క్రేజ్.. 8888 నంబర్కు భారీ ధర!

కార్ల ఫ్యాన్సీ నంబర్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇందుకోసం కొందరు లక్షల్లో ఖర్చు పెడుతుంటారు. కానీ హరియాణాలో ఓ వ్యక్తి ఏకంగా HR88B8888 నంబర్ ప్లేట్ కోసం ఏకంగా ₹కోటి పైనే వెచ్చించాడు. ఈ నంబర్ కోసం నిర్వహించిన వేలంలో 45 అప్లికేషన్లు వచ్చాయి. బిడ్డింగ్ ధర ₹50 వేలుగా నిర్ణయించగా రికార్డు స్థాయిలో ₹1.17 కోట్లు పలికింది. దేశంలో అత్యంత ఖరీదైన రిజిస్ట్రేషన్ నంబర్గా నిలిచింది.


