News October 17, 2024

విద్యార్థుల అరెస్టును ఖండిస్తున్నాం: హరీశ్‌రావు

image

TG: న్యాయం కోసం శాంతియుత నిరసన చేస్తున్న గ్రూప్స్ అభ్యర్థులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని BRS MLA హరీశ్‌రావు అన్నారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘విద్యార్థులుండే అశోక్‌నగర్‌లో కరెంట్ తీసేసి, నిర్బంధించడమే ప్రజా పాలన? ఎన్నికలప్పుడు రాహుల్‌గాంధీ అశోక్‌నగర్‌లో ఓట్లడిగింది మరిచిపోయారా? ’అని ప్రశ్నించారు.

Similar News

News February 3, 2026

ధనుష్, సాయి పల్లవి జోడీగా మరో సినిమా

image

‘మారి 2’ సినిమాతో మెరిసిన ధనుష్, సాయి పల్లవి జోడీ మరోసారి వెండితెరపై సందడి చేయనున్నారు. అమరన్ మూవీతో సత్తాచాటిన రాజ్‌ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో ఈ జంట నటించనుంది. హీరో ధనుష్‌కు ఇది 55వ చిత్రం. ఈ సినిమాలో ఇప్పటికే హీరోయిన్‌గా శ్రీలీల ఎంపిక కాగా.. మరో కథానాయికగా సాయి పల్లవిని సెలక్ట్ చేశారు. వాస్తవ సంఘటనల ఆధారంగా, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం.

News February 3, 2026

ఇండియన్ టెక్నాలజీతోనే హైస్పీడ్ రైళ్లు: నిర్మలా సీతారామన్

image

దేశంలో రాబోయే హైస్పీడ్ రైలు నెట్‌వర్క్ పూర్తిగా దేశీయ టెక్నాలజీతోనే సాగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ బుల్లెట్ తరహా రైళ్లు ఇండియన్ టెక్నాలజీతో, మేడ్ ఇన్ ఇండియా కోచ్‌లతోనే పట్టాలెక్కుతాయని బడ్జెట్ తర్వాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ముంబై-పుణే, పుణే-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై సహా మొత్తం 7 కారిడార్లను బడ్జెట్‌లో ప్రతిపాదించిన విషయం తెలిసిందే.

News February 3, 2026

బలహీన పోలింగ్ బూత్‌లపై TDP ప్రత్యేక దృష్టి

image

AP: అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఓట్లు బాగా తగ్గిన పోలింగ్ బూత్‌లపై TDP ప్రత్యేక దృష్టి సారించింది. ఇలాంటి బూత్‌లు 4500 ఉన్నట్లు గుర్తించి వాటిపై సర్వే చేయించింది. వివిధ పదవులు పొందిన 1000 మంది నాయకులతో ఈ సర్వే పూర్తి చేసింది. వీటిలో ఉన్న లోపాలపై నివేదికలను రప్పించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు SEC కసరత్తు చేపట్టిన నేపథ్యంలో అంతకు ముందుగా ఈ బూత్‌లలో పార్టీని పటిష్ఠం చేసేలా శిక్షణకు నిర్ణయించింది.