News September 4, 2024
బుడమేరు గండ్లు పూడ్చలేకపోయాం: చంద్రబాబు

AP: వర్షాల కారణంగా బుడమేరుకు పడిన గండ్లను ఇంకా పూడ్చలేకపోయామని CM చంద్రబాబు తెలిపారు. విజయవాడలో CM మీడియాతో మాట్లాడారు. ‘వరద బాధితులకు నాణ్యమైన ఆహారాన్ని పంచుతున్నాం. 100కుపైగా ఫైరింజన్లతో బురద క్లీన్ చేస్తున్నాం. మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నాం. 2,100 మంది పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేస్తున్నారు. 32 మంది IASలు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News January 10, 2026
ప్రెగ్నెన్సీలో ఈ సమస్య రాకుండా ఉండాలంటే?

సాధారణంగా కొంతమందిలో గర్భధారణ సమయంలో రక్తం గడ్డ కట్టే సమస్య ఏర్పడుతుంది. ఒకవేళ ఇంతకు ముందు లేకపోయినా కొంతమందిలో ఈ సమస్య ప్రెగ్నెన్సీ సమయంలో 4-5 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీకి ముందే ఈ సమస్య ఉందా లేదా అనేది చెక్ చేయించుకోవాలి. అందుకోసం దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. లేదంటే గర్భధారణ సమయంలో ప్రాణాపాయ స్థితి ఏర్పడే అవకాశముందంటున్నారు నిపుణులు.
News January 10, 2026
శని దోష నివారణకు దివ్యౌషధం ‘పుష్య మాస శనివారం’

పుష్యమాసంలో వచ్చే శనివారం శని దోష నివారణకు అత్యంత విశిష్టమైనదని జ్యోతిషులు చెబుతున్నారు. ఏలినాటి శని, అష్టమ శని ప్రభావంతో బాధపడేవారు ఈ నెలలో శని ఆరాధనతో సత్ఫలితాలు పొందవచ్చని అంటున్నారు. నేడు శనైశ్చరుడుకి తైలాభిషేకం చేసి, నల్ల నువ్వులు దానం చేస్తే జాతక దోషాలు క్షీణించి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని సూచిస్తున్నారు. శనిగ్రహ శాంతి పూజలు, మంత్రాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.
News January 10, 2026
వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి దరఖాస్తు ఎలా?

రైతులు ఈ పథకం కోసం స్థానిక వ్యవసాయ విస్తరణాధికారి (AEO) లేదా వ్యవసాయాధికారిని సంప్రదించి దరఖాస్తు తీసుకొని, తమకు కావలసిన యంత్రం వివరాలను నింపి ఇవ్వాలి. దానిని వారు ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేస్తారు. MRO, MPDO, AOలతో కూడిన ‘మండల స్థాయి కమిటీ’ అర్జీలను పరిశీలించి జిల్లా అధికారులకు పంపుతుంది. వారి ఆమోదం తర్వాత, యంత్రాలిచ్చే కంపెనీ పేరిట రైతులు తమ వాటా సొమ్మును డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.


