News January 9, 2025
అంతా కేటీఆర్ చెప్పినట్లే చేశాం..

TG: ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో KTR చెప్పినట్లే తాము చేశామని IAS అర్వింద్ కుమార్, BLN రెడ్డి విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. అర్వింద్ను ఏసీబీ, రెడ్డిని ఈడీ నిన్న ప్రశ్నించాయి. విదేశీ కంపెనీకి నేరుగా నిధులు చెల్లిస్తే సమస్యలొస్తాయని చెప్పినా తాను చూసుకుంటానని ఆయన అన్నారని అర్వింద్ చెప్పినట్లు సమాచారం. రేసింగ్ వ్యవహారంలో తాను నిమిత్తమాత్రుడినేనని రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది.
Similar News
News January 5, 2026
చలి తీవ్రతతో కోళ్లకు పెరుగుతున్న ముప్పు

చలి గాలులు, పొగ మంచు వల్ల రాత్రి వేళ కోళ్ల షెడ్లలో తేమ అధికమై అది ఆవిరి కాకుండా ఉండిపోతుంది. దీని వల్ల కోళ్లలో శ్వాస సంబంధ వ్యాధుల ముప్పు, లిట్టర్లో తేమ శాతం పెరగడం వల్ల పరాన్నజీవులు, శిలీంధ్రాల బెడద పెరుగుతుంది. చలికి కోళ్లు ఒత్తిడికి లోనవడం వల్ల వాటిలో వ్యాధి నిరోధకత శక్తి తగ్గి CRD, ఐబీ, కొక్కెర రోగం, బ్రూడర్ న్యుమోనియా, కోకిడియోసిస్ వ్యాధుల ముప్పు పెరిగి కోళ్ల మరణాలకు కారణమయ్యే ప్రమాదం ఉంది.
News January 5, 2026
నీళ్లు వృథా కాకుండా ఎవరైనా వాడుకోవచ్చు: సీఎం చంద్రబాబు

AP: ఏటా కృష్ణా, గోదావరి నుంచి వేల టీఎంసీలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని తెలుగు మహా సభలో సీఎం చంద్రబాబు తెెలిపారు. అందుకే ఉమ్మడి ఏపీలోనూ ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. ఇప్పుడూ నీళ్లు వృథా కాకుండా ఎవరు వాడుకున్నా ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఇక నదుల అనుసంధానంతో దేశంలో నీటి సమస్య లేకుండా చేయాలని సీఎం చెప్పారు. గంగా-కావేరీ, గోదావరి-పెన్నా నదులు కలవాలన్నారు.
News January 5, 2026
ఎన్ని నీళ్లు వాడుకున్నా అడ్డు చెప్పలేదు: సీఎం చంద్రబాబు

AP: తెలంగాణతో నీటి వివాదాలపై CM చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. అందుకే తెలంగాణ ఎన్ని నీళ్లు వాడుకున్నా ఎప్పుడూ అడ్డుచెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం కట్టినా ఫర్వాలేదు మనకూ నీళ్లు వస్తాయని ఊరుకున్నాం. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు సమైక్యత అవసరం. నీటి విషయంలోగానీ సహకారంలోగానీ తెలుగు వారంతా కలిసే ఉండాలి’ అని తెలుగు మహా సభల సందర్భంగా పిలుపునిచ్చారు.


