News April 12, 2025

TGIICకి మేం లోన్ ఇవ్వలేదు: ICICI

image

TG: కంచ గచ్చిబౌలి భూములను తనఖా పెట్టి ICICI బ్యాంకులో TGIIC రూ.10వేల కోట్ల లోన్ తీసుకుందన్న మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలపై సంబంధిత బ్యాంక్ స్పందించింది. తాము TGIICకి ఎలాంటి మార్టిగేజ్ లోన్ ఇవ్వలేదని ఓ ప్రకటన విడుదల చేసింది. బాండ్ నిధుల స్వీకరణ, వడ్డీ చెల్లింపులకు సంబంధించి తాము కేవలం అకౌంట్ బ్యాంక్‌గానే వ్యవహరించామని పేర్కొంది. TGIIC తమ వద్ద భూమిని తనఖా పెట్టలేదని స్పష్టం చేసింది.

Similar News

News December 1, 2025

డ్రామాపైనే మోదీ దృష్టి: ఖర్గే

image

ముఖ్యమైన అంశాలపై చర్చించడం కంటే డ్రామాపై ప్రధాని మోదీ ఎక్కువ దృష్టి పెట్టారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. గత 11 ఏళ్లుగా ప్రభుత్వం పార్లమెంటరీ మర్యాదను దెబ్బతీస్తోందని ఆరోపించారు. గత పార్లమెంట్ సమావేశాల్లో కనీసం చర్చించకుండా 15 నిమిషాల్లోనే కొన్ని బిల్లులు పాస్ చేసిందని విమర్శించారు. సాగు చట్టాలు, జీఎస్టీ సవరణలు, సీఏఏపై తగిన చర్చ లేకుండా పార్లమెంటును బుల్డోజ్ చేసిందన్నారు.

News December 1, 2025

దిత్వా ఎఫెక్ట్.. వరి కోత యంత్రాలకు పెరిగిన డిమాండ్

image

తెలుగు రాష్ట్రాల్లో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ తరుణంలో దిత్వా తుఫాన్ రావడంతో.. వరి పండిస్తున్న రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తుఫానుకు తమ పంట ఎక్కడ దెబ్బతింటుందో అని చాలా మంది రైతులు వరి కోత సమయం రాకముందే కోసేస్తున్నారు. దీంతో వరి కోత యంత్రాలకు డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా కోత యంత్రాల యజమానులు.. ఎకరా పంట కోయడానికి రూ.4వేలకు పైగా వసూలు చేస్తున్నట్లు రైతులు వాపోతున్నారు.

News December 1, 2025

నేవీ అధికారి భార్యను రైలు నుంచి తోసేసిన TTE!

image

యూపీలో నేవీ అధికారి భార్య మృతి కేసులో రైల్వే టీటీఈపై కేసు నమోదైంది. నవంబర్ 26న వైద్యం కోసం ఢిల్లీకి బయలుదేరిన ఆర్తి(30) పొరపాటున మరో ట్రైన్ ఎక్కారు. టికెట్ విషయమై ఆర్తికి TTEతో వివాదం తలెత్తగా లగేజ్‌తో పాటు ఆమెను బయటకు తోసేశాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే చనిపోయిందన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో ఘటనపై ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నట్లు GRP అధికారులు తెలిపారు.