News December 13, 2024
మేం పర్మిషన్ ఇవ్వలేదు: పోలీసులు

అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు వచ్చేందుకు తాము పర్మిషన్ ఇవ్వలేదని చిక్కడపల్లి పోలీసులు తెలిపారు. బందోబస్తు కల్పించాలని లెటర్ రాసినట్లు సంధ్య థియేటర్ లాయర్ ఆ లేఖను కోర్టుకు సమర్పించారు. అయితే ప్రీమియర్ షోలు వేసుకోవచ్చు కానీ హీరో, హీరోయిన్ రావద్దని చెప్పినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు. పైగా బన్నీ ర్యాలీగా వచ్చారని, ర్యాలీలకు ముందస్తు అనుమతి ఉండాలని పోలీసులు చెబుతున్నారు.
Similar News
News November 9, 2025
SVUకు ర్యాగింగ్ మకిలి.. కొత్త అడ్మిషన్ల పరిస్థేంటి.?

గోరుచుట్టపై రోకలిబండలా SVU పరిస్థితి మారింది. ఓ <<18239778>>లెక్చరర్ తీరు<<>>తో అంతంత మాత్రంగా ఉన్న అడ్మిషన్లు మరింత దిగజారే ప్రమాదం నెలకొంది. SVUలో ఇటీవల PG అడ్మిషన్లు తగ్గుతున్నాయి. విద్యార్థులు లేకకొన్ని కోర్సులు మూసేశారు. లాంగ్వేజ్ కోర్సుల పరిస్థితి దయనీయం. ఇలాంటి తరుణంలో వర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. అరకొర అడ్మిషన్లతో నెట్టుకొస్తుంటే ఇలాంటి ఘటనల వల్ల విద్యార్థుల ఎలా చేరుతారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి
News November 9, 2025
బుల్లెట్, థార్ బండ్లను అస్సలు వదలం: హరియాణా డీజీపీ

థార్ నడిపే వ్యక్తులు రోడ్లపై విన్యాసాలు చేస్తారని హరియాణా DGP ఓపీ సింగ్ అన్నారు. ‘మేం అన్ని వాహనాలను తనిఖీ చేయం. కానీ బుల్లెట్ బైక్, థార్ కార్లను అస్సలు వదలం. మీరు ఎంచుకునే వాహనాలే మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. థార్ స్టేటస్ సింబల్ అయింది. ఇటీవల ఓ ACP కొడుకు థార్ నడిపి ఒకరిని ఢీకొట్టాడు. తన కుమారుడిని రక్షించాలని అధికారి వేడుకున్నాడు. కారు అతడి పేరు మీదే ఉంది. అతడొక మోసగాడు’ అని చెప్పారు.
News November 9, 2025
ఆముదం పంటలో దాసరి పురుగు నివారణ ఎలా?

దాసరి పురుగు ఆముదం పంటను జనవరి మాసం వరకు ఆశిస్తుంది. ఈ పురుగు పంటపై ఆశించిన తొలిదశలో ఆకులను గోకి తర్వాత రంధ్రాలు చేసి ఆకులన్నీ తింటాయి. పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లేత కొమ్మలను, కాడలను, పెరిగే కాయలను తిని పంటకు తీవ్ర నష్టాన్ని కలగజేస్తాయి. దాసరి పురుగుల నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా థయోడికార్బ్ 1.5 గ్రా. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ కలిపి పంటపై పిచికారీ చేయాలి.


