News May 22, 2024
పిన్నెల్లిని అరెస్ట్ చేసినట్లు మాకు తెలియదు: SP

TG: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్పై తమకు సమాచారం లేదని సంగారెడ్డి ఎస్పీ రూపేశ్ తెలిపారు. ఈవీఎం ధ్వంసం కేసులో ఆయనను అరెస్ట్ చేయాలని ఏపీ పోలీసులు చెప్పినట్లు వెల్లడించారు. అయితే ఆయన కోసం గాలిస్తున్నామని, అదుపులోకి తీసుకున్నట్లు తమకే తెలియదన్నారు. కాగా పిన్నెల్లిని సంగారెడ్డి సమీపంలోని ఇస్నాపూర్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.
Similar News
News December 5, 2025
ఒంటరితనంతో మహిళల్లో తగ్గుతున్న ఆయుష్షు

ప్రస్తుతకాలంలో చాలామందిలో ఒంటరితనం పెరిగిపోతుంది. అయితే దీర్ఘకాలంగా లోన్లీనెస్తో బాధపడుతున్న వారిలో ఆయుష్షు తగ్గుతున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. ఇది స్త్రీలపై ఎక్కువ ప్రభావం చూపుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీనివల్ల మహిళల DNA రక్షణ కవచంలోని కణాలు కుంచించుకుపోవడం వల్ల వృద్ధాప్యం త్వరగా వస్తున్నట్లు తెలిపారు. మహిళల్లో స్ట్రెస్ హార్మోన్లు పెరగడం, ఇమ్యునిటీ తగ్గడం దీనికి కారణమని చెబుతున్నారు.
News December 5, 2025
రాజకీయాల్లోకి రమ్మని లోకేశ్ను ఫోర్స్ చేయలేదు: CBN

AP: పిల్లల్లోని ఇన్నోవేటివ్ ఆలోచనలు గుర్తించేందుకు స్టూడెంట్స్ పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహిస్తామని CM CBN PTMలో తెలిపారు. ‘నేనెప్పుడూ లోకేశ్ స్కూలుకు వెళ్లలేదు. టీచర్లతోనూ మాట్లాడలేదు. ఫౌండేషన్ ఇప్పించానంతే. చదువుకొని మంత్రి అయ్యారు. రాజకీయాల్లోకి రమ్మనీ ఫోర్స్ చేయలేదు’ అని అన్నారు. కష్టంగా ఉంటుందన్నా విద్యాశాఖనే ఎంచుకున్నారని చెప్పారు. విద్యార్థులు కలలు సాకారం చేసుకొనేలా అండగా ఉంటామన్నారు.
News December 5, 2025
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 124 పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(<


