News January 25, 2025
కాళేశ్వరం కడితే మేం అభ్యంతరం చెప్పలేదు: చంద్రబాబు

AP: గోదావరి జలాలను బనకచర్లకు తరలిస్తే తెలంగాణకు నష్టమంటూ బీఆర్ఎస్ నేత <<15250698>>హరీశ్ రావు<<>> చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. ‘బనకచర్లకు గోదావరి నీళ్లు తరలిస్తే తెలంగాణకు నష్టం లేదు. వరద జలాలను మాత్రమే తరలిస్తాం. తెలంగాణలో గోదావరి నదిపై కాళేశ్వరం నిర్మిస్తే మేం అభ్యంతరం చెప్పలేదు’ అని వెల్లడించారు. అటు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందితే అది దేశాభివృద్ధికి దోహదం చేస్తుందని చెప్పారు.
Similar News
News December 12, 2025
సౌండ్ బాక్సులు బద్దలయ్యే విజయ నినాదం: లోకేశ్

‘అఖండ-2’లో బాలా మామయ్య నట తాండవం ప్రేక్షకులను కనువిందు చేయనుందని మంత్రి లోకేశ్ తెలిపారు. ‘God of Masses మూవీ అంటే సౌండ్ బాక్సులు బద్దలయ్యే విజయ నినాదం. ఈ మూవీ అఖండ విజయం సాధించాలని కోరుకుంటున్నా. 5 దశాబ్దాల సినీ చరిత్రలో మరో ఘనవిజయం సొంతం చేసుకోబోతున్న మామయ్యకు అభినందనలు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. అఖండ-2 రేపు విడుదల కానుండగా, ఇప్పటికే ప్రీమియర్స్ మొదలయ్యాయి.
News December 12, 2025
భారీ మెజార్టీతో BRS బలపరిచిన అభ్యర్థి గెలుపు

TG: ములుగు(D) ఏటూరు నాగారం సర్పంచ్‌గా BRS బలపరిచిన కాకులమర్రి శ్రీలత గెలుపొందారు. ప్రత్యర్థి గుడ్ల శ్రీలతపై 3వేల పైచిలుకు ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇక్కడ మొత్తం ఓట్లు 8,333 పోలయ్యాయి. BRS బలపరిచిన అభ్యర్థికి 5,520, కాంగ్రెస్ సపోర్ట్ చేసిన అభ్యర్థికి 2,330 ఓట్లు వచ్చాయి. మంత్రి సీతక్క ఇక్కడ 5 సార్లు ప్రచారం చేసినా కాంగ్రెస్ గెలవలేకపోయిందని BRS నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.
News December 12, 2025
3.02 కోట్ల IRCTC ఫేక్ అకౌంట్లు బ్లాక్.. కేంద్రం ప్రకటన

2025 JAN నుంచి ఇప్పటివరకు 3.02 కోట్ల IRCTC ఫేక్ అకౌంట్లను డీయాక్టివేట్ చేసినట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. AKAMAI వంటి యాంటీ బాట్ టూల్స్‌తో నకిలీ అకౌంట్లను బ్లాక్ చేశామన్నారు. జనరల్, తత్కాల్ టికెట్లు సామాన్యులకు అందుబాటులో ఉండేలా రిజర్వేషన్ వ్యవస్థలో మార్పులు చేస్తున్నామని లోక్‌సభలో తెలిపారు. తత్కాల్ బుకింగ్స్‌లో ఆధార్ లింక్డ్ ఓటీపీ వ్యవస్థను దశలవారీగా అందుబాటులోకి తెస్తున్నామన్నారు.


