News December 23, 2024

అల్లు అర్జున్ మామ వచ్చినట్లు మాకు తెలియదు: మహేశ్ కుమార్

image

TG: అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి గాంధీభవన్‌కు వచ్చినట్లు తమకు తెలియదని TPCC చీఫ్ మహేశ్ కుమార్ తెలిపారు. ఆయనొచ్చిప్పుడు తాము ప్రెస్‌మీట్లో ఉన్నామన్నారు. తర్వాత చంద్రశేఖర్ ఫోన్ చేసి మాట్లాడారని, మళ్లీ వచ్చి కలుస్తానని చెప్పినట్లు వెల్లడించారు. AAతో తమకు వ్యక్తిగతంగా ఎలాంటి వైరం లేదని మహేశ్ మరోసారి స్పష్టం చేశారు. గాంధీభవన్‌కు వచ్చిన చంద్రశేఖర్‌ను మున్షీ మాట్లాడకుండానే పంపించేశారు.

Similar News

News February 4, 2026

సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ రిలీజ్

image

UPSC సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ 2026 విడుదలైంది. ఈ ఏడాది ఐఏఎస్, ఐపీఎస్ తదితర సర్వీసుల్లో మొత్తం 933 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇవాళ్టి నుంచి ఈనెల 24వ తేదీ 6PM వరకు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఈ లింక్‌ను <>క్లిక్<<>> చేయండి. SHARE IT

News February 4, 2026

ప్రాజెక్టులకు రూ.18వేల కోట్లు బకాయి పెట్టారు: రామానాయుడు

image

AP: గత ప్రభుత్వం రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి రూ.18వేల కోట్లు బకాయి పెట్టిందని మంత్రి రామానాయుడు విమర్శించారు. YCP విధ్వంసంతో ఇరిగేషన్ శాఖ గాడి తప్పిందన్నారు. పోలవరం, హంద్రీనీవా, వెలిగొండ, గాలేరునగరి, పోలవరం ఎడమ ప్రధాన కాలువ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. ఖరీఫ్ ముగిసినా రిజర్వాయర్లలో నీరుందంటే చంద్రబాబు వాటర్ మేనేజ్‌మెంట్ వల్లే అని పేర్కొన్నారు.

News February 4, 2026

IND vs SA.. లైవ్ ఇక్కడ చూడండి

image

T20WC వార్మప్ మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికాపై టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. గత వరల్డ్ కప్ ఫైనల్లో తలపడిన ఇరు జట్లు మళ్లీ ఈ టోర్నీలో వార్మప్ మ్యాచ్‌లో ఢీకొంటున్నాయి. 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో లైవ్ చూడొచ్చు.
IND: అభిషేక్, ఇషాన్, సూర్యకుమార్(C), తిలక్, శాంసన్, పాండ్య, రింకూ, దూబే, అక్షర్, అర్ష్‌దీప్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్.