News June 22, 2024
మీలాగా మేము గనుల వేలంలో పాల్గొనలేదు: KTR

TG: బొగ్గు గనుల వేలంపై సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య ట్విటర్ వార్ కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం మాదిరి గతంలో తాము గనుల వేలంలో పాల్గొనలేదని కేటీఆర్ తాజాగా ట్వీట్ చేశారు. ఆస్తులు తాకట్టు పెట్టడంలో కాంగ్రెస్, బీజేపీ భాగస్వాములని దుయ్యబట్టారు. రాష్ట్ర నదీప్రాంత హక్కుల రక్షణలో కాంగ్రెస్ విఫలమైందని, గనుల ప్రైవేటీకరణలో బీజేపీకి సహకరిస్తోందని కేటీఆర్ విమర్శించారు.
Similar News
News November 21, 2025
ఇతిహాసాలు క్విజ్ – 73 సమాధానాలు

సమాధానం: పంచ పాండవుల ప్రాణాలు తీసే శక్తి కలిగిన 5 బాణాలను భీష్ముడి నుంచి దుర్యోధనుడు తీసుకుంటాడు. దివ్య దృష్టితో ఈ విషయం తెలుసుకున్న కృష్ణుడికి పూర్వం అర్జునుడికి, దుర్యోధనుడు వరమిచ్చిన విషయం గుర్తుకు వస్తుంది. దీంతో ఆయన అర్జునుడిని, దుర్యోధనుడి వద్దకు పంపి ఆ బాణాలు కావాలనే వరం కోరమని చెబుతాడు. ఇచ్చిన వరం కారణంగా, మాట తప్పకూడదు కాబట్టి దుర్యోధనుడు వాటిని అర్జునుడికి ఇచ్చేస్తాడు. <<-se>>#Ithihasaluquiz<<>>
News November 21, 2025
పదో తరగతి ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

AP: టెన్త్ <
News November 21, 2025
అమల్లోకి కొత్త లేబర్ కోడ్స్

కార్మికులకు భరోసా కల్పించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త లేబర్ కోడ్లు నేడు అమల్లోకి వచ్చాయి. వీటిలో కోడ్ ఆన్ వేజెస్(2019), ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్(2020), కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ(2020), ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండీషన్స్ కోడ్(2020) ఉన్నాయి. గతంలో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం వీటిని తీసుకొచ్చింది.


