News November 28, 2024
మేం కక్ష సాధింపులకు పాల్పడట్లేదు: మంత్రి డోలా
AP: గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు ఎన్నో దారుణాలు చేశారని మంత్రి డోలా వీరాంజనేయస్వామి ఆరోపించారు. నాడు మూగబోయిన గొంతులు నేడు బయటకు వస్తున్నాయని, తప్పుచేసిన వారిని వదిలేది లేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వచ్చి 5 నెలలు గడిచినా ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదని తెలిపారు. సెకీతో విద్యుత్ ఒప్పందాల విషయంలో స్కామ్ జరిగిందని, నష్ట నివారణ కోసం వైసీపీ నేతలు ప్రెస్మీట్లు పెడుతున్నారని విమర్శించారు.
Similar News
News November 28, 2024
‘పుష్ప 2’ విడుదలకు సర్వం సిద్ధం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2’ మూవీ విడుదలకు సర్వం సిద్ధమైంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకోగా, తాజాగా ఎడిటింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్నట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇప్పటికే పట్నా, చెన్నై, కొచ్చిలో నిర్వహించిన పలు ఈవెంట్లు సక్సెస్ కావటంతో మూవీ టీమ్ ఫుల్ ఖుషీలో ఉంది. మరో 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
News November 28, 2024
శిండేకు dy.CM పదవిపై ఆసక్తి లేదు: శివసేన MLA
డిప్యూటీ CM పదవిపై ఏక్నాథ్ శిండేకు ఆసక్తి లేదని, కానీ క్యాబినెట్లో ఉంటారని శివసేన MLA షిర్సత్ అన్నారు. సీఎంగా చేసిన వ్యక్తికి డిప్యూటీ సీఎం పదవి సరిపోదనే భావనలో ఆయన ఉన్నట్లు వివరించారు. అటు, డిప్యూటీ సీఎం పదవికి మరో వ్యక్తిని శిండే శివసేన నామినేట్ చేస్తుందని చెప్పుకొచ్చారు. నేడు ‘మహాయుతి’ నేతలు ఢిల్లీ పర్యటనకు వెళ్లనుండగా, మహారాష్ట్ర CM ఎవరనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
News November 28, 2024
6 నెలల్లో రూ.60 వేల కోట్ల అప్పు: గుడివాడ అమర్నాథ్
AP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి మంగళవారం అప్పుల రోజుగా మారిపోయిందని వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రూ.60 వేల కోట్లు అప్పు చేసిందని ఆరోపించారు. ‘తొలి సంతకం చేసిన మెగా డీఎస్సీ ఏమైంది? ఇప్పటివరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. పరవాడ ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే. ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.