News October 8, 2024

నాగార్జున పిటిషన్ నిలబడదనుకుంటున్నాం: సురేఖ తరఫు లాయర్

image

మంత్రి కొండా సురేఖపై నటుడు నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ కోర్టులో నిలబడేలా లేదని ఆమె తరఫు న్యాయవాది తిరుపతి వర్మ అన్నారు. ‘ఈ కేసు విచారణలో ముగ్గురు వ్యక్తుల వాంగ్మూలాల్లో తేడాలు ఉన్నాయి. నాగార్జున పిటిషన్‌లో ఒకటి, వాంగ్మూలంలో మరొకటి చెప్పారు. ఆయన కోడలు సుప్రియ ఇంకొకటి చెబుతున్నారు. మరో సాక్షి వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేస్తుంది. ఒకవేళ నోటీసులు వస్తే చట్టపరంగా ఎదుర్కొంటాం’ అని ఆయన చెప్పారు.

Similar News

News March 25, 2026

రైతు భరోసా దరఖాస్తుకు నేడే ఆఖరు

image

TG: ఇప్పటి వరకు రైతు భరోసా పథకంలో లబ్ధిపొందని, అప్లై చేయని అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళే ఆఖరు తేదీ. 28.02.26 లోపు పట్టా పొందిన రైతులు.. ఈ సాయంత్రంలోగా స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారి(AEO)ని కలిసి దరఖాస్తులను సమర్పించవచ్చు. రైతు భరోసా దరఖాస్తుకు భూమి పాస్‌బుక్ జిరాక్స్ లేదా తహసీల్దార్ డిజిటల్ సంతకం చేసిన పేపర్, ఆధార్‌కార్డ్, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్‌లను జతచేసి AEOకు అందజేయవచ్చు.

News March 25, 2026

రైలులో ప్రయాణిస్తున్నారా.. ఇది తెలుసా?

image

రైలు ప్రయాణికులకు కొన్ని నిబంధనలపై అవగాహన ఉండకపోవచ్చు. ఈక్రమంలో మిడిల్ బెర్త్ కేటాయిస్తే రాత్రి 10గంటల నుంచి ఉదయం 6 వరకు మాత్రమే ఉపయోగించాలని సదరన్ రైల్వే ట్వీట్ చేసింది. అయితే దీనిని ఎవరూ పాటించట్లేదని, ఈ నిబంధన స్టిక్కర్‌ను కోచ్‌లలో అంటించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా చేస్తే అర్ధరాత్రి ట్రైన్ ఎక్కిన ప్రయాణికులకు నిద్ర ఉండదని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

News March 25, 2026

షా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం

image

పశ్చిమాసియాలో యుద్ధం, దాని పరిణామాలపై చర్చించేందుకు ఈ సాయంత్రం అఖిలపక్ష సమావేశం జరగనుంది. దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహించనున్నారు. ప్రభుత్వం తరఫున ఐదారుగురు మంత్రులు ఈ భేటీకి హాజరుకానున్నారు. విదేశాంగ శాఖ కార్యదర్శి తాజా పరిస్థితులను నేతలకు వివరించనున్నారు. అటు తెలంగాణ సీఎం రేవంత్ ఇంధన పరిస్థితులపై ఈ మధ్యాహ్నం 2 గం.కు అధికారులతో సమీక్షించనున్నారు.