News August 28, 2024
ఆ హెలికాప్టర్‌ను మేం వద్దన్నాం.. అయినా పంపారు: ప్రభుత్వ వర్గాలు

AP: సీఎం చంద్రబాబు కోసం వస్తున్న హెలికాప్టర్ <<13948573>>కూలిపోయిన<<>> ఘటనపై ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. ‘CBN బెల్ హెలికాప్టర్‌ను వినియోగిస్తున్నారు. అయితే హరియాణాలో ఎన్నికల ప్రచారం కోసం గ్లోబల్ వెక్ట్రా కంపెనీ వద్ద BJP దాన్ని అద్దెకు తీసుకుంది. దీంతో అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్‌ను చంద్రబాబు పర్యటనలకు ఇస్తామని సంస్థ ప్రతిపాదన పంపింది. మేం ఒప్పుకోకపోయినా దాన్నే పంపింది’ అని పేర్కొన్నాయి.
Similar News
News November 13, 2025
ఇండియా A విజయం

సౌతాఫ్రికా Aతో జరిగిన తొలి అనధికార వన్డేలో ఇండియా A విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 9 వికెట్లు కోల్పోయి 285 రన్స్ చేసింది. అనంతరం భారత్ 49.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (117) సెంచరీతో అదరగొట్టారు. తిలక్ వర్మ 39, నితీశ్ 37, అభిషేక్ శర్మ 31 రన్స్ చేశారు.
News November 13, 2025
ఉచితంగానే సదరం స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్: సత్యకుమార్ యాదవ్

AP: దివ్యాంగుల పెన్షన్ కోసం సదరం స్లాట్ బుకింగ్ రేపట్నుంచి ప్రారంభమవుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇప్పటికే స్లాట్ బుకింగ్ చేసుకున్న 10వేల మందికి తొలి ప్రాధాన్యమిస్తామన్నారు. దివ్యాంగుల ఆర్థికస్థితిని పరిగణనలోకి తీసుకొని స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్ ముద్రణకు గతంలో ₹40 చొప్పున ఉన్న ఫీజును రద్దు చేసినట్లు చెప్పారు. సదరం సర్టిఫికెట్ల ఆధారంగానే కొత్త పెన్షన్లను అధికారులు మంజూరు చేస్తారు.
News November 13, 2025
హైదరాబాద్ మెట్రో: 4, 6 కోచ్‌లతో రైళ్లు!

TG: హైదరాబాద్ మెట్రోలో రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో 4, 6 కోచ్‌ల రైళ్లను ప్రవేశపెట్టాలని HMRL యోచిస్తోంది. ఇందుకోసం 40-60 కోచ్‌లను తీసుకురానున్నట్లు HMRL ఎండీ సర్ఫరాజ్ తెలిపారు. ప్రస్తుతం 3 మార్గాల్లో 3 కోచ్‌లతో 56 రైళ్లు తిరుగుతున్నాయని పేర్కొన్నారు. వీటిలో ఎలాంటి మార్పులు చేయకుండా కొత్తగా 4, 6 కోచ్‌లతో ట్రైన్లను తీసుకొస్తామని వివరించారు. ఇందుకు రెండేళ్లకు పైగా సమయం పట్టొచ్చని చెప్పారు.


