News May 5, 2024
పీఓకేను బలవంతంగా స్వాధీనం చేసుకోనక్కర్లేదు: రాజ్‌నాథ్

పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్ బలవంతంగా స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. కశ్మీర్‌లో అభివృద్ధిని చూసి POK ప్రజలు స్వచ్ఛందంగా భారత్‌లో చేరాలనుకుంటున్నారని అన్నారు. ‘జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు గణనీయంగా మెరుగయ్యాయి. అక్కడ సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఎత్తివేసే సమయం దగ్గర్లోనే ఉంది. హోంశాఖ దీనిపై ఓ నిర్ణయాన్ని తీసుకోనుంది’ అని పేర్కొన్నారు.
Similar News
News January 28, 2026
అలసంద మొక్కల ఆకులను పురుగులు తినేస్తున్నాయా?

అలసంద పంటను ఆకు తినే పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి. ఈ పురుగులు ఆకులను తినేయడం వల్ల మొక్కల ఎదుగుదల లోపిస్తుంది. వీటి తీవ్రత పెరిగితే దిగుబడిపై కూడా ప్రభావం పడుతుంది. ఈ పురుగుల నివారణకు లీటరు నీటికి 5ml వేప గింజల కషాయాన్ని లేదా లీటరు నీటికి 3ml అజాడిరక్టిన్ (3000 PPM) చొప్పున కలిపి పంటపై పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News January 28, 2026
AP క్యాబినెట్ నిర్ణయాలు

* అర్జున అవార్డు గ్రహీత, అథ్లెట్ జ్యోతికి విశాఖలో 500 చ.గజాల స్థలం, డిగ్రీ తర్వాత గ్రూప్-1 జాబ్
* ఏపీ టిడ్కోకు హడ్కో నుంచి రూ.4,451 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారంటీ
* అమరావతిలో వీధిపోటు స్థలాలు పొందిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు.. అమరావతి పరిధిలో అనాథలకు, భూమి లేని పేదలకు పెన్షన్లు
* అల్లూరి జిల్లా నందకోటలో పర్యాటక శాఖ ఫైవ్‌స్టార్ రిసార్ట్ ఏర్పాటుకు భూ కేటాయింపు
News January 28, 2026
ఏపీ జంగిల్ రాజ్‌గా మారింది: వైఎస్ జగన్

AP: రాష్ట్రం జంగిల్ రాజ్‌గా మారిందని YCP చీఫ్ జగన్ ధ్వజమెత్తారు. ‘ప్రభుత్వ ఉద్యోగిని రైల్వే కోడూరు MLA వేధించారు. MLAలు రవికుమార్, ఆదిమూలం అలాగే ప్రవర్తించారు. కూటమి నేతలు దగ్గరుండి బెల్టు షాపులు నడిపిస్తున్నారు. సంక్రాంతి కోడిపందేలకు వేలం పెట్టారు. GOVT దగ్గరుండి అన్నీ చేయిస్తోంది’ అని దుయ్యబట్టారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంటు స్కీమ్‌లను నిర్వీర్యం చేశారని WG నేతలతో భేటీలో మండిపడ్డారు.


