News July 6, 2024
హార్దిక్ కూడా మనిషేనని మర్చిపోయాం: కృనాల్

తన సోదరుడు హార్దిక్ కూడా భావోద్వేగాలు కలిగిన మనిషేనని అందరం మర్చిపోయామని కృనాల్ పాండ్య అన్నారు. T20WC విజేత జట్టులో సభ్యుడు కావడంపై కృనాల్ సంతోషం వ్యక్తం చేశారు. రోహిత్ స్థానంలో MI కెప్టెన్ అయినప్పుడు హార్దిక్‌ను అందరూ ఎగతాళి చేయడంతో పాటు ఎన్నో మాటలు అన్నారని గుర్తు చేసుకున్నారు. గత 6 నెలలు అతడికి కష్టంగా గడిచాయని, ఇప్పుడు సాధించిన దానికి హార్దిక్ పూర్తి అర్హుడని కృనాల్ అభిప్రాయపడ్డారు.
Similar News
News March 5, 2026
ప్రపంచంలో రద్దీగా ఉండే జలసంధులు ఇవే..

వివిధ ఖండాల మధ్య ఉన్న జలసంధుల ద్వారా చమురు రవాణా సాగుతుంటుంది. ఇందులో మలక్కా జలసంధి అతి ముఖ్యమైనది. ఇండోనేషియా దీవుల్లో ఉండే ఈ సంధి ద్వారా రోజుకు 23.2 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్ సరఫరా అవుతుంది. ఆ తర్వాత ఇరాన్ దగ్గరలోని హార్ముజ్ (20.9 M), సౌతాఫ్రికా కింద ఉన్న కేప్ ఆఫ్ గుడ్ హోప్ (9.1 M), ఈజిప్ట్ సూయిజ్ కెనాల్ (4.9 M), డానిష్ సంధి (4.9 M) ఉన్నాయి. తాజా యుద్ధంతో హార్ముజ్‌ను మూసివేశారు.
News March 5, 2026
హైదరాబాద్ CCMBలో ఉద్యోగాలు

HYDలోని<
News March 5, 2026
రాజ్యసభ అభ్యర్థి నితీశ్ కుమార్ నామినేషన్

బిహార్ సీఎం నితీశ్ కుమార్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అంతకుముందు కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం షా సమక్షంలో నితీశ్ నామినేషన్ ఫైల్ చేశారు. రాజ్యసభ ఎన్నికలు జరిగే మార్చి 16 వరకు ఆయన సీఎం పదవిలో ఉంటారని జేడీయూ వర్గాలు చెబుతున్నాయి.


